News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

మరో ఆర్టీసీ డ్రైవర్‌ ఆత్మహత్య

ఆర్టీసీ సమ్మెపై సర్కార్ నిర్లక్ష్యానికి మరో బలి.

‌ ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో మరో కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపానికి గురైన ఓ ఆర్టీసీ డ్రైవర్‌ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. 2007 నుంచి ఆర్టీసీ డ్రైవర్‌గా పని చేస్తున్న ఆవుల నరేశ్‌  ఈ తెల్లవారుజామున పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీనిని గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నరేశ్‌ మృతిచెందాడు. మృతునికి భార్య పూలమ్మ, కుమారులు శ్రీకాంత్, సాయి కిరణ్ ఉన్నారు.
భార్య గత ఐదేళ్లుగా అనారోగ్యంతో బాధ పడుతోంది. ఆమె మందులకు నెలకు సుమారు రూ.5 వేలు ఖర్చవుతున్నాయనీ.. మరోవైపు పిల్లల చదువుతో నరేశ్‌ ఆర్థిక ఇబ్బందులు పడుతున్నట్లు తోటి ఉద్యోగులు తెలిపారు. నరేశ్‌ ఆత్మహత్య వార్త తెలుసుకున్న కార్మికులు, అఖిలపక్ష పార్టీల నేతలు పెద్ద ఎత్తున ఆస్పత్రికి తరలివచ్చారు.

- Advertisement -


మృతదేహంతో ర్యాలీకి యత్నం
డ్రైవర్‌ నరేశ్‌ మృతదేహంతో ర్యాలీకి కార్మికులు, నేతలు యత్నించారు. ఆస్పత్రి నుంచి బస్సు డిపో వరకు ర్యాలీకి యత్నించిన కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బస్సు డిపో ఎదుట వారు ధర్నాకు దిగారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.

Leave A Reply

Your email address will not be published.