News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

పెళ్లైతే గర్బవతి కావాలా

టీమిండియా సారథి విరాట్ కోహ్లీ సతీమణి.. బాలీవుడ్‌ అందాల నటి అనుష్కా శర్మ గర్భవతి అని జరుగుతున్న ప్రచారంపై ఎట్టకేలకు ఆమె స్పందించారు. ఈ ప్రచారాన్ని ఆమె కాస్త సీరియస్ గానే తీసుకున్నారు. వివాహం అయిన వెంటనే జనాలు అడగడానికి ఈ ప్రశ్నలు తప్ప ఇంకేమీ ఉండవా.. ఇలాంటి వార్తలు చదవడానికి కొందరికి ఉత్సాహంగా ఉంటుందేమో.. చెప్పడానికి పక్కవాళ్లకి కాస్త ఇబ్బందిగా ఉంటుంది.. ఫలానా నటి డేటింగ్‌లో ఉందా.. ఉంటే ఎవరితో డేటింగ్ లో ఉంది.. ఆమె పెళ్లెప్పుడు.. ఒకవేళ పెళ్లయితే గర్భవతి అయ్యిందా.. వంటి ప్రశ్నలు అడుగుతుంటారని అనుష్క శర్మ ఘాటుగానే స్పందించింది.

anushka

- Advertisement -

నటులకు కూడా వ్యక్తిగత జీవితం ఉంటుందని, వాళ్లూ స్వేచ్ఛగా జీవించాలనుకుంటారని ఎందుకు అనుకోరని నిలదీసింది. ఇలాంటి వ్యవహారాలపై నేనెందుకు స్పందించాలని అనుష్క ప్రశ్నించింది. క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం తనకు లేదని.. పెళ్లయిన ఆడవాళ్లు వదులు దుస్తులు వేసుకుంటే వాళ్లు గర్భవతులనా అని కాస్త ఆగ్రహం వ్యక్తం చేసింది. ట్రెండీగా ఉండటం కోసం వేసుకున్నారు అనుకోవచ్చు కదా అని వ్యాఖ్యానించింది అనుష్క శర్మ.

Tags: anushka, anushka sharma, anushka sharma about prgnency, anushka sharma about pregnency, anushka sharma with virat kohli

Leave A Reply

Your email address will not be published.