News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

అమ‌రావతిపై నాన్చెప్పిందే.. జ‌రుగుద్ది.

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిపై జ‌రుగుతున్న‌దుమారం అంతా ఇంతా కాదు. రాజ‌ధాని అంద‌రిది..ఏ ఒక్క సామిజిక వ‌ర్గానిదో కాదు అని మొన్న మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ చేసిన వ్యాఖ్య‌లతో ..అమ‌రావ‌తిని త‌ర‌లించే కుట్ర జ‌ర‌గుతుంద‌ని టిడిపితోపాటు.. అమ‌రావ‌తి చుట్టుప‌క్క‌ల రైతులు అంధోళ‌న బాట ప‌ట్టారు. ఇప్ప‌డికే రైతులు పార్టీల మ‌ద్ద‌తు కూడా కూడ‌గ‌డుతున్నారు. ఇప్ప‌డికే వారు జ‌న‌సేనా అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్, బిజేపి ఎంపి సుజ‌నా చౌద‌రిల‌ను క‌లిసి.. త‌మ గోడును వెళ్ల‌బోసుకున్నారు. అయితే ఇలా అమ‌రావ‌తి చుట్టుప‌క్క‌న ప్ర‌జ‌లు, రైతులు, విప‌క్షాల వ‌త్తిడి పెర‌గ‌డంతో..అబ్బే .. మా ప్ర‌భుత్వం ఎక్క‌డా రాజ‌ధానిని మార్చ‌తామ‌ని చెప్ప‌లేద‌ని కొంద‌రు మంత్రులు చెప్ప‌డ‌మే కాదు.. రాజ‌ధానిపై బొత్స చేసిన వ్యాఖ్య‌లు ఆయ‌న వ్య‌క్తిగ‌తంగా చేసిన‌ట్లుగా క‌ల‌రింగ్ ఇచ్చారు. స‌హ‌చ‌ర మంత్రులు మాట మార్చ‌డంతో.. బొత్స కూడా కొద్దిగా డైల‌మాలో ప‌డి.. సైలెంట్ అయ్యారు.

ap_minister_bothsa_sathynarayana

ఇక సీఎం జ‌గ‌న్ మెహ‌న్ రెడ్డి అమెరికా ప‌ర్య‌ట‌న ముగించుకుని రావ‌డంతో.. రాజ‌ధానిపై క్లారిటి వ‌స్తుంద‌ని అంతా భావించారు.రాజధానిపై కామెంట్ప్ చేసిన మంత్రి బొత్స‌తో వివ‌ర‌ణ ఇప్పిస్తారని అంద‌రు అనుకున్నారు. కాని దీనికి బిన్నంగా.. తాజాగా  బొత్స కామెంట్స్ చేశారు. రాజధాని అంశంపై నేను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్లు మరోసారి స్పష్టం చేశారు. దీంతో.. ఇక రాజ‌ధాని త‌ర‌లింపు ఖాయ‌మ‌న్న తెలిపోయింది.

- Advertisement -

bothsa_sathyanarayana_on_amravathi_shifting

అయితే ఇదంతా సీఎం జ‌గ‌న్ డైరెక్ష‌ణ్ లోనే జ‌రుగుతుంద‌ని టాక్. మొద‌లు జ‌గ‌న్ రాష్ట్రంలో లేక‌పోవ‌డంతో.. అంతా బొత్స వ్య‌క్త‌గ‌తంగా చేసి ఉండ‌వ‌చ్చ‌ని  అనుకున్నారు. అయితే జ‌గ‌న్ వ‌చ్చిన త‌ర్వాత కూడా బొత్స తాను చేసిన వ్యాఖ్య‌ల‌కు  క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని తేల్చిచెప్ప‌డంతో….ఎక్కువ వ‌ర‌ద వ‌స్తే.. అమ‌ర‌వాతి మున‌గ‌డం ఖాయ‌మ‌ని మ‌రోసారి తేల్చేశారు. ఇదంతా జ‌గ‌న్ ఆదేశాల‌మేర‌కే.. మంత్రి బొత్స క‌థ న‌డిపిస్తున్నార‌ని ఏపీలో పాలిటిక్స్ లో వినిపిస్తుంది. ఇక దీనితో.. ఇన్నాళ్లు ఏపీ రాజ‌ధానిగా ఉన్న అమ‌రావ‌తి.. ఇక త‌ర‌లిపోవ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. ఇదిలావుంటే.. ఇప్ప‌డికే టిడిపి, జ‌న‌సేనా, బిజేపీలు రాజ‌ధానిని మార్చ‌వ‌ద్ద‌ని వాదిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం జ‌గ‌న్ అమ‌రావ‌తిని మార్చుతారా.. లేక.. వ‌త‌త్ఇడిల‌కు త‌లొగ్గి.. అమ‌ర‌వాతిని రాజధానిగా  కొన‌సాగిస్తారో చూడాలి.
Tags: ap politics, capital amaravathi, shifting, cm jagan mohan reddy, minister bothsa sathyanaraya, bjp, janasena, chandrababu, pavan kalyan

Leave A Reply

Your email address will not be published.