News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

అరుణ్ జెట్లీ ఇక‌లేరు..

కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ శనివారం క‌న్నుమూశారు. తీవ్ర అనారోగ్యానికి గురికావ‌డంతో.. ఈనెల 9న‌, డిల్లీలోని ఏయిమ్స్ ఆసుప‌త్రిలో అడ్మ‌ట్ అయ్యారు అరుణ్ జెట్లి. ఇర‌వై రోజుల‌గా వైధ్యులు చికిత్స చేస్తున్న ఫ‌లించ‌క‌పోవ‌డంతో.. ఈరోజు   తుది శ్వాస విడిచారు జెట్లీ. దేశ రాజ‌కీయ‌ల్లో త‌న ముద్ర వేసిన అరుణ్ జెట్లీ.. 1952, నవంబర్ 28న ఢిల్లీలో జన్మించారు. ఢిల్లీ నుంచి డిగ్రీ, న్యాయశాస్త్ర పట్టా పొందారు. ఢిల్లీ విశ్వ విద్యాలయంలో అభ్యసిస్తున్న సమయంలో విద్యార్థి సంఘం నాయకుడిగా యాక్టీవ్ గా ప‌నిచేశారు. బిజేపీ అనుభంధ సంఘ‌మైనా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నాయకుడి నుండి అంచ‌లంచ‌లుగా ఎదిగారు. 1991 నుంచి బీజేపీ కార్యవర్గంలో పని చేశారు అరుణ్ జైట్లీ.

arun_jetly_political_career.

వాజ్ పేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగా ప‌నిచేశారు. ఇక అక్క‌డి నుండి.. జెట్లీ జాతీయ రాజ‌కీయాల‌లో, బిజేపీ పార్టీలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు.2014 లో మోడీ కెబినెట్లో.. ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు జెట్లీ. అయితే.. కీడ్నీ సంబంధిత‌ వ్యాదితో అనారోగ్యానికి గురికావ‌డం.. తో జెట్లీ కెబినెట్ల నుండి త‌ప్పుకున్నారు. అప్ప‌డిదాకా.. ఆయ‌న నిర్వ‌హిస్తు వ‌చ్చిన ఆర్థిక శాఖ‌ను.. పీయూష్ గోయ‌ల్ కు అప్ప‌గించారు మోడి. ఇక  జైట్లీ ఇటీవలే జరిగిన సార్వత్రిక ఎన్నికలకు దూరంగా ఉన్నారు. ఇక‌ ఈ ఏడాది మే 14న ఆయ‌న‌కు రెనాల్ ట్రాన్స్ ప్లాంటేషన్ జరిగింది.

- Advertisement -

arun_jetly_died.

అయితే జెట్లీ ఆకాల మ‌ర‌ణంపై దేశ వ్యాప్తంగా వివిధ పార్టీల నేత‌లు త‌మ సంతాపం వ్య‌క్తం చేశారు. ప్ర‌ధాని మోడి, రాష్ట్రప‌తి కోవింద్ తోపాటు.. సోనియా గాంధి, రాహుల్ గాంధి, మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ త‌మ ప్ర‌గాఢ సానుభూతిని ప్ర‌క‌టించారు. ఇక తెలంగాణ ఏర్పాటులో జెట్లీ కీలంగా వ్య‌వ‌హ‌రించార‌ని .. ఆయ‌న మృతికి త‌మ ప్రగాఢ సానుభూతిని వ్య‌క్తం చేశారు టిపిసిసి ఛీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి లు.

Leave A Reply

Your email address will not be published.