News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

నాగార్జునను మరిపిస్తుందా

సంచలనాలకు కేంద్ర బిందువైన బిగ్ బాస్ సీజ‌న్-3 ప్ర‌స్తుతం స్టార్‌మా ఛానెల్‌లో ప్ర‌సారం అవుతుంది. చాలా వివాదాల మ‌ధ్య బిగ్‌బాస్ సీజన్ 3 షో ఎట్టకేలకు మొదలై సుమారు 40 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సీజ‌న్‌కు అక్కినేని నాగార్జున వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్నారు. ప్రతి శ‌ని, ఆదివారాల్లో బిగ్ బాస్ షోను హోస్ట్ చేసి ఎలిమినేష‌న్ చేస్తూ వ‌చ్చిన నాగార్జున‌ ఈవారం అందుబాట‌లో ఉండ‌రని తెలుస్తోంది. ఆయ‌న త‌న పుట్టిన‌రోజు సెల‌బ్రేష‌న్స్ కోసం కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి అందరు స్పెయిన్ వెళ్లారు. అందుకని బిగ్‌బాస్ 3లో ఈవారం హోస్ట్‌గా నాగార్జున క‌న‌ప‌డ‌టం లేదు.

మ‌రి ఆయ‌న లేక‌పోతే బిగ్‌బాస్ 3ని ఎవ‌రు హోస్ట్ చేస్తార‌నే దానిపై ఆసక్తి నెలకొంది. ఇదిగో ఇటువంటి సమయంలోనే అందాల భమ రమ్యకృష్ణ పేరు తెరపైకి వచ్చింది. స్టార్ మా యాజమాన్యం అనూహ్యగా బిగ్‌బాస్ 3 హోస్ట్‌గా శివగామిని తీసుకొచ్చింది. అందుకు  సంబంధించిన ప్రోమో కూడా విడుదలైంది. దీంతో నాగార్జున స్థానంలో వస్తున్న రమ్యకృష్ణ బిగ్ బాస్ షో ను ఎలా నడిపిస్తారన్నదానిపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

- Advertisement -

Tags: big boss, ramya krishna, ramyakrishna, ramyakrishna in big boss, ramyakrishna enter in big boss, actress ramyakrishna participate in big boss, ramyakrishna enter in big boss show

Leave A Reply

Your email address will not be published.