News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

అక్కడ అమ్మాయిలు ఫోన్ వాడకూడదు

చంద్రుడిపై కాలు మోపి.. అక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకునేంత టెక్నాలజీని పెంపొందించుకున్ననవ సమాజంలో మహిళలపై ఇంకా చిన్నచూపు చూస్తూనే ఉన్నారు. ఇందుకు గుజరాత్ రాష్ట్రంలోని బాణస్కాంత గ్రామ పెద్దలు తీసుకున్న నిర్ణయమే నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఆ గ్రామంలోని ఠాకూర్ కులానికి చెందిన పెళ్లి కాని అమ్మాయిలు మొబైల్ ఫోన్లను వాడకూడదు. ఈమేరకు నిషేధం విధిస్తూ ఆ గ్రామ కుల పెద్దలు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. బాణస్కాంత గ్రామంలో కుల పెద్దలు తీసుకున్న నిర్ణయం ఆ గ్రామస్థులందరికీ రాజ్యాంగం లాంటిదట.  అందుకే ఆ గ్రామంలోని ఠాకూర్ కులానికి చెందిన పెళ్లి కాని అమ్మాయిలు ఏ మాత్రం మొబైల్ ఫోన్ వినియోగించరు. ఎవరైనా గ్రామ పెద్దల నిర్ణయాన్ని ఉల్లంఘించి ఫోన్ వాడితే, ఆ అమ్మాయి తండ్రికి లక్షన్నర రూపాయలు జరిమానా విధిస్తారట. ఇక పెళ్లి కాని అమ్మాయిలు ఫోన్ వినియోగంపై నిషేధం విధించడం సరైంది కాదని మాజీ ఎమ్మెల్యే అల్పేష్ ఠాకూర్ అభిప్రాయపడ్డారు. ప్రేమ వివాహాలకు వ్యతిరేకంగా ఠాకూర్ కుల పెద్దలు నిర్ణయం తీసకున్నారని, కాని తాను కూడా ప్రేమ వివాహమే చేసుకున్నానని అల్ఫేష్ ఠాకూర్ చెప్పుకొచ్చారు.

- Advertisement -

Tags: cell phone baned, cell phone, cell phone ban, cell phone ban for unmarried girls, smart phone ban for unmarried girls, cell phone ban for unmarried girls in gujarath

Leave A Reply

Your email address will not be published.