News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

హుజూర్ న‌గ‌ర్ లో వార్ వ‌న్ సైడ్..

  • అన్ని స‌ర్వేల్లోనూ కాంగ్రెస్ దే పైచెయ్యి ..
  • అన్ని మండ‌లాల్లోనూ కాంగ్రెస్ కు జ‌న నీరాజ‌నం ..
  • ఇంటిలిజెన్స్ రిపోర్ట్స్ తో డీలాప‌డుతున్న టీఆర్ఎస్ నేత‌లు .
  • ప్ర‌చారానికి మొహం చాటేసిన కేటీఆర్,హ‌రీశ్ రావు ..
  • హుజూర్ న‌గ‌ర్ లో స‌భ ర‌ద్దు చేసుకున్న కేసీఆర్ ..

congress leaders huzurnagar political campaign

న‌ల్గొండ : హుజూర్ న‌గ‌ర్ ఉప ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ స్పీడ్ కు కారు టైరు పంచ‌ర్ కాక త‌ప్పేట్లు లేదు. అవును ఈ ఉప ఎన్నిక‌ల్లో ఏ ఒక్క అంశం కూడా టీఆర్ఎస్ కు క‌లిసొచ్చే ప‌రిస్థితులు లేవ‌నే చెప్పాలి. స‌హ‌జంగా ఉప ఎన్నిక‌ల‌న్నీ అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయి. అధికారంలో ఉన్న పార్టీ .. అంగ బ‌లం .. అర్థ బ‌లంతో ఎన్నిక‌ల్లో గెలుపు సునాయ‌సం చేసుకుంటాయి. నాయోజ‌క‌వ‌ర్గంలోని అధికారులు .. పోలీసులు అధికార పార్టీ అభ్య‌ర్థికి వ‌త్తాసు ప‌లుకుతూ ఉంటారు. కానీ హుజూర్ న‌గ‌ర్ లో అందుకు భిన్న‌మైన ప‌రిస్థితులు ఉన్నాయి. ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి కాంగ్రెస్ అభ్య‌ర్థి ప‌ద్మావ‌తి రెడ్డి త‌న ఆదిక్య‌త‌ను కొన‌సాగిస్తున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు .. ఎమ్మెల్సీలు .. మంత్రులు అక్క‌డ మ‌కాం వేసి ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నా .. వారి పాచిక‌లు పార‌డం లేదు.

congress leaders huzurnagar political campaign

- Advertisement -

సీఎం కేసీఆర్ ఎట్టిప‌రిస్థితుల్లోనూ ఈ ఉప ఎన్నిక‌లలో గెల‌వాల‌ని పార్టీ నాయ‌కుల‌కు హుకూం జారీ చేసిన‌ప్ప‌టికీ .. ప్ర‌జ‌ల్లో మాత్రం టీఆర్ఎస్ అభ్య‌ర్థి అంటే ప్ర‌జ‌లు ముక్కిరుస్తున్నారు. కేసీఆర్ ఎప్ప‌టిక‌ప్పుడు ఇంటిలిజెన్స్ స‌ర్వే రిపోర్ట్స్ తెప్పించుకుంటున్నా .. ఏ ఒక్క రిపోర్ట్ కూడా సైదిరెడ్డికి అనుకూలంగా లేద‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుత తాజా స‌ర్వే కూడా కాంగ్రెస్ అభ్య‌ర్థి ప‌ద్మావ‌తి రెడ్డి కంటే టీఆర్ఎస్ అభ్య‌ర్థి సైదిరెడ్డి ఏడు శాతం ఓట్ల తేడాతో వెన‌క‌బ‌డి ఉన్నార‌ని గులాబీ పార్టీలో గుస గుస‌లు వినిపిస్తున్నాయి. నియోజ‌క‌వ‌ర్గంలోని అన్ని మండ‌లాల్లోనూ ప్ర‌జ‌లు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో ఏం చేయాలో దిక్కుతోచ‌ని స్థితిలో ప‌డ్డారు అధికార పార్టీ నాయ‌కులు. ఈ ప‌రిణామాల‌తో కేటీఆర్ ప్ర‌చారానికి వెళ్ళ‌కుండా మొహం చాటేశార‌ని స్వంత పార్టీలోనే నాయ‌కులు చెవులు కొరుక్కుంటున్నారు. ఇక తాజాగా సీఎం కేసీఆర్ హుజూర్ న‌గ‌ర్ లో త‌న స‌భ‌ను ర‌ద్దు చేసుకోవ‌డం కూడా దీనికి సంకేత‌మ‌ని చెప్పాలి.

congress leaders huzurnagar political campaign

ఇక దీనిక తోడు రాష్ట్రంలో ఆర్టీసీ స‌మ్మె ఎఫెక్ట్ కూడా హుజూర్ న‌గ‌ర్ ఎన్నిక‌లో స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. నియోజ‌క‌వ‌ర్గంలోని ఆర్టీసీ కార్మిక కుటుంబాలు బ‌హాటంగానే కాంగ్రెస్ కు మ‌ద్ద‌తు ప‌లుకుతుండ‌టం కూడా టీఆర్ఎస్ నాయ‌కుల‌కు మింగుడు ప‌డ‌టం లేదు. ఇక రాష్ట్రంలో కేసీఆర్ మాదిగ‌ల‌కు అన్యాయం చేస్తున్నారంటూ .. మాదిగ దండోరా నాయ‌కులు స‌తీష్ మాదిగ నేతృత్వంలో సైదిరెడ్డికి వ్య‌తిరేకంగా .. కాంగ్రెస్ కు మ‌ద్ద‌తుగా పెద్దెత్తునా నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌చారంలో పాల్గొంటున్నారు. ఇది కూడా టీఆర్ఎస్ కు పెద్ద మైన‌స్ గానే చెప్పాలి. మొత్తానికి హుజూర్ న‌గ‌ర్ ఉపెన్నిక‌లో వార్ వ‌న్ సైడ్ అన్న‌ట్లు .. కాంగ్రెస్ అభ్య‌ర్థి ప‌ద్మావ‌తి రెడ్డికే విజ‌యావ‌కాశాలు స్స‌ష్టంగా క‌నిపిస్తున్నాయి.

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.