News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

పీసీసీ పదవికి వారిద్దరే అర్హులు.. కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి..!

తెలంగాణ పీసీసీ చీఫ్ గా కొత్త వ్యక్తిని ఎంపిక చేస్తారన్న నేపథ్యంలో కాంగ్రెస్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ వివాదారహిత రికార్డున్న నాయకులే పీసీసీ చీఫ్ గా ఎన్నికవుతారని అన్నారు. కాంగ్రెస్ లో జీవన్ రెడ్డి, శ్రీధర్ బాబులే వివాదరహితులని అన్నారు.

- Advertisement -

అయితే కాంగ్రెస్‌లో రేవంత్ రెడ్డి మరో పవర్ సెంటర్ అన్న ప్రచారంలో ఏమాత్రం తప్పులేదని అన్నారు. కాంగ్రెస్‌లో రేవంత్ వ్యక్తిగతంగా ఎదగాలని అనుకోవడంలో తప్పులేదన్నారు. అయితే వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చుపెట్టినా అధిష్ఠానం పీసీసీ చీఫ్ పదవిని ఇవ్వదని చెప్పారు. వ్యక్తిగతంగా ఎవరు ఎదిగినా అది పార్టీకి మేలుచేస్తుందని అభిప్రాయపడ్డారు. అయితే ప్రస్తుతం కేసీఆర్ పాలనలో ప్రజలు విసిగిపోతున్నారని వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.