News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

బ్రేకింగ్: దిశ హత్య కేసు నిందితుల ఎన్‌కౌంటర్..

  • సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తున్న సమయంలో తప్పించుకునే యత్నం
  • పారిపోతున్న నిందితులను కాల్చివేసిన పోలీసులు
  • నిందితులు నలుగురూ అక్కడికక్కడే మృతి

Disha, Encounter, Hyderabad, Shamsahbad

హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన దిశ హత్యాచార కేసులో నిందితులను ఎన్‌కౌంటర్ చేసినట్టు తెలుస్తోంది. చర్లపల్లి జైలు నుంచి నిందితులను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం షాద్‌నగర్ తీసుకెళ్లారు. ఆ సమయంలో నిందితులు తప్పించుకునే ప్రయత్నం చేస్తుండగా పోలీసులు ఎన్‌కౌంటర్ చేసినట్టు సమాచారం.

Disha, Encounter, Hyderabad, Shamsahbad

- Advertisement -

పోలీసుల కళ్లుగప్పి పారిపోయేందుకు నిందితులు ప్రయత్నించారు. దీంతో పోలీసులు కాల్పులు జరపగా ప్రధాన నిందితుడు అరిఫ్, శివ, నవీన్, చెన్నకేశవులు మృతి చెందారు. దిశను సజీవ దహనం చేసిన ప్రాంతంలోనే ఎన్‌కౌంటర్ జరగడం గమనార్హం.

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ‘దిశ’ఘటనలో విచారణ కోసం ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టును ఏర్పాటు చేయాల్సిందిగా అధికారులను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించిన విషయం తెలిసిందే. హైకోర్టు అనుమతితో ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టును ఏర్పాటు చేస్తూ 3వ తేదీతో న్యాయ శాఖ ఉత్తర్వులు (జీవో ఆర్‌టీ నంబర్‌ 639) జారీ చేసింది.

Tags: Disha, Encounter, Hyderabad, Shamsahbad

Leave A Reply

Your email address will not be published.