News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

బిక్ష‌గాడిగా.. రేమాండ్స్ అదినేత‌  

  • అద్దె ఇల్లు.. చేతిలో చిల్లి గ‌వ్వ‌లేక ఇబ్బందులు ప‌డుతున్న సింఘానియా
  • పాపం.. విజ‌య్ ఫ‌థ్ సింఘానియా
  • ప్ర‌తి పేరెంట్ కు గుణ‌పాఠం సింఘానియ స్టోరి..

Don't Love Your Child Blindly Advises Former Chief Raymond

డ‌బ్బు..  మ‌నిషిలో స్వార్థాన్ని పెంచుతుందా.. ? డ‌బ్బు.. మ‌నిషిలోని మాన‌వ‌త్వాన్ని చంపేస్తుందా..? డ‌బ్బుపై మోజు…  కుటుంబంలోని ఆప్యాయ‌త అనురాగాల‌ను దూరం చేస్తుందా.. ? డ‌బ్బు.. మిద ఉన్న పిచ్చి.. చివ‌రికి క‌న్న‌వారిని రోడ్డున ప‌డేసే వ‌ర‌కు.. తీసుకువెళుతుందా..?  అవును..ఇది నిజం. దేశంలోనే వ‌స్త్ర‌వ్యాపారంలో త‌న‌దైన బ్రాండ్ ను సృస్టించిన రేమాండ్స్ అదినేత ఇంట్లో  ఇప్పుడు ఇదే జ‌రిగింది. . త‌న కుటుంబం కోసం.. త‌న బిడ్డ‌ల కోసం.. నిరంత‌రం ప‌రిత‌పిస్తు.. ఇటుక ఇటుక పేర్చిన‌ట్లు.. రెమాండ్స్ సంస్థ‌ను నిర్మించి.. వ్యాపారంలో స‌క్కెస్ తీరాన్ని చేరిన రేమాండ్స్. వ్య‌వ‌స్థాప‌కులు.. విజయ్ పథ్ సింఘానియా ప్ర‌స్తుతం బిక్ష‌గాడి అయ్యాడు. నాడు.. కార‌ల్ మాస్క్స్ చెప్పిన  మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలేస‌ అన్న‌ది.. ఇప్ప‌డు ఈవ్యాపార దిగ్గ‌జం.. విజ‌య్ ఫ‌థ్ సింఘానియా విష‌యంలో నిజ‌మైంది.

Don't Love Your Child Blindly Advises Former Chief Raymond

- Advertisement -

అవును..  ఇప్పుడు దేశంలోని  ప్ర‌తి త‌ల్లిదండ్రులు ఆలోచించే విదంగా.. చేస్తున్న ఈ సింఘానియా క‌థ ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రేమాండ్స్ అదినేత‌.. దేశ వ్యాప్తంగా.. వస్త్ర పరిశ్రమలో  రారాజుగా వెలిగాడు. సంస్థ‌ను స్తాపించిన అన‌తి కాలంలోనే.. రేమాండ్ప్ కు బ్రాండ్ ను సృష్టించారు. క్వాలిటినే మూల‌ద‌నంగా.. సంస్థ‌ను లాభాలా బాట ప‌ట్టించారు. వేల‌తొ మొద‌లు పెట్టిన వ్యాపారాన్ని.. వేయి కోట్లు దాటించాడు. దేశ వ్యాప్తంగా.. వేల కోట్ల ఆస్తులు సంపాదించారు. ప్ర‌స్తుతం ఆయ‌న‌కు 80 ఏళ్ళు. ఇంత ఆస్తి పాస్తులు . దిగ్గ‌జ‌ వ్యాపారి గా పేరు ప్ర‌ఖ్యాతులున్న విజ‌య్ సింఘానియా..  ప్ర‌స్తుతం తినడానికి తిండి లేక, ఉండటానికి ఇల్లు లేక కిరాయి ఇంట్లో నెట్టుకోస్తున్నారు. ఇంత ద‌య‌నీయ ప‌రిస్తితికి తీసుకువ‌చ్చింది.. ఆయ‌న స్వంత కొడుకే. డ‌బ్బు పిచ్చిలో ప‌డ్డ ఆయ‌న  పుత్ర ర‌త్నం.. గౌతమ్ సింఘానియా.

అంద‌రిలాగే.. త‌న బిడ్డ‌ల కోసం ఆస్థులు సంపాదించిన‌ట్లే.. విజ‌య్ ప‌థ్ సింఘానియా  రేమాండ్స్ ద్వారా సంప‌ద‌న సృష్టించారు. దాన్ని త‌న కుమారుడికి రాసిచ్చారు. ఏకంగా.. ఒక వెయ్యి 41 కోట్లు వ్యాపారం, బొంబాయిలో.. వేల కోట్ల‌ విలువ చేసే.. 36 అంతస్థుల భ‌వ‌నం ను కుమారుడు గౌత‌మ్ పేరు మిద రాసిచ్చారు. ఇక అంతే.. ఆ కొడుకులోని అస‌లు రూపం బ‌య‌టి కొచ్చింది. డ‌బ్బు పిచ్చిలో ప‌డి.. క‌న్న తండ్రి అని చూడ‌కుండా.. ఇంటినుండి బ‌య‌టికి గేంటేశాడు ఈ ద‌ర్మార్ఘుడు. దీంతో  చేతిలో చిల్లిగవ్వ లేక అద్దె ఇంట్లో ఉంటూ.. నానా అవ‌స్థ‌లు ప‌డుతున్న విజయ్ సింఘానియా త‌న‌కు న్యాయం చేయాలంటూ.. కోర్టును ఆశ్ర‌యించ‌డం ఇప్పుడు అంద‌రిని క‌లిచి వేస్తుంది. 80ఏళ్ల వయసులో ఆయన పడుతున్న ఈ కష్టాన్ని చూసి ప్ర‌తి త‌ల్లి దండ్రుల్లో ఆవేద‌న వ్యక్తం అవుతుంది. తనకు రావాల్సిన ఆస్తి, డబ్బును ఇప్పించాలని రేమాండ్ దిగ్గజం విజయ్ పథ్ సింఘానియా కోర్టును  ఆశ్ర‌యించ‌డం.. ప్ర‌తి ఒక్క‌రిని ఆలోచించేలా చేస్తుంది.

Don't Love Your Child Blindly Advises Former Chief Raymondఎనిమిది పదుల వయసులో హాయిగా పిల్లలు, మనవళ్లు, మనవరాళ్లతో ఆడుకోవాల్సిన వేళ‌ కోట్లు సంపాదించిన  సింఘానియా.. ఇప్పుడు త‌ను జీవించ‌డానికి.. అయ్యే ఖ‌ర్చుల‌కు కావ‌ల్సిన డ‌బ్బును  ఇప్పించ‌డ‌ని.. కోర్టును ఆశ్ర‌యించ‌డం.. అత్యంత ద‌య‌నీయం. సింఘానియా పిటీష‌న్ పై.. కోర్టు ఈనెల‌ 22న  తదుపరి విచారణ జరుప‌నుంది. ఈ సింఘానియా క‌థ‌.. కాదు కాదు.. నిజం.. చూస్తున్న ప్ర‌తి త‌ల్లిదండ్రుల‌కు ఒక హెచ్చ‌రిక అని చెప్ప‌వ‌చ్చు. కొడుకులు, కూతుళ్ల పై ప్రేమ ఎంత ఉన్నా..  ప్రాణం విడిచే వరకు కొంత మొత్తం ఉంచుకోవాలన్న విష‌యాన్ని మ‌రువ‌ద్ద‌ని ఈ రేమాండ్ అధిపతి జీవితం మ‌న‌కు చాటుతుంది క‌దూ.

Tags: Don’t Love Your Child, Blindly Advises, Former Chief, Raymond, Vijaypath Singhania, former chief

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.