శైలజారెడ్డి అల్లుడు రివ్యూ..

news02 Sept. 13, 2018, 6:45 p.m. entertainment

sailajareddy alludu

సినిమా పిల్లర్- అక్కినేని నగచైతన్య నటించిన శైలజారెడ్డి అల్లుడు సినిమా రివ్యూ మీకోసం...
సినిమా- శైలజారెడ్డి అల్లుడు
తారాగణం- నాగచైతన్య, రమ్యకృష్ణ, అను ఇమాన్యుయేల్, వెన్నెల కిశోర్, నరేష్ తదితరులు..
నిర్మాత‌లు- నాగ‌వంశీ.ఎస్‌, పీడీవీ ప్ర‌సాద్‌
ద‌ర్శ‌క‌త్వం- మారుతి

న్యూస్ పిల్లర్ రేటింగ్- 2/5

పరిచయం.....
అక్కినేని నాగచైతన్య ముందు నుంచి విభిన్నమైన కధలనే ఎంచుకుంటూ వస్తున్నాడు. వైవిధ్యమైన మాస్ సినిమాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక దర్శక నిర్మాత మారుతీ సైతం చిన్న సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారాడు. నానితో భలే భలే మగాడివోయ్ సినిమాతో డైరెక్టర్ గా తానేంటో నిరూపించుకున్నాడు మారుతి. ఇదిగో ఇప్పుడు నాగచైతన్య, మారుతి కాంబినేషన్ లో వచ్చిన సినిమానే శైలజారెడ్డి అల్లుడు. మరి సినిమా ఎలా ఉండో చూసేద్దామా...

anu

సినిమా కధ..
చైతన్య (నాగచైతన్య) సాధాసీదాగా ఉండే యువకుడు. అందరి పట్ల సానుకూల ధృక్పదంతో కలిసిమెలిసి మసులుకుంటాడు. కానీ చైతన్య తండ్రి మురళీ శర్మ కు మాత్రం అహంకారం ఎక్కువ. తానేం చెబితే అదే జరగాలని కోరుకునే వ్యక్తి. ఇక అనుకోకుండా అను (అను ఇమాన్యూయేల్) చైతన్య జీవితంలోకి వస్తుంది. అనూది కూడా చాలా అహంకారమున్న వ్యక్తిత్వం.  తండ్రితోనే వేగలోకపోతున్న చైతన్యకు తాను ప్రేమించిన అనుతో మరింత ఇబ్బంది పడతాడు.

ఇక ఇదే క్రమంలో తాను ప్రేమించిన అను తల్లి ఈ ఇద్దరి కంటే మరీ అహంకారం ఉన్న మనిషని అర్ధమవుతుంది చైతన్యకు. తండ్రి, ప్రేమించిన అమ్మాయితోనే సతమతమవుతున్న చైతన్య అత్తగారి అహంకారంతో మరీ చతికిలపడిపోతాడు. మరి ప్రేమికురాలు.. అత్త మధ్య చైతన్య నలిగిపోయాడా.. లేక వాళ్లిద్దరిని తన దారికి తెచ్చుకున్నాడా అన్నదే శైలజారెడ్డి అల్లుడు సినిమా కధ.

sailajareddy alludu

ఎలా ఉందంటే...
అత్త-అల్లుడు నేపధ్యంలో తెలుగులో చాలా సినమాలు వచ్చాయి. చాలా వరకు సినిమాలు సక్సెస్ అయ్యాయి కూడా. సాధారనంగా అత్తా అల్లుడు సినిమాల్లో ఇరువరి మధ్య ఎత్తుకు పై ఎత్తులే ఉంటాయి. ఈ సినిమాలోను దర్శకుడు మారుతి అదే ప్రయత్నం చేశాడు. సినిమా కధ పాతదే అయినా కొత్తగా చూపించాలన్న ప్రయత్నం విఫలమయ్యిందని చెప్పవచ్చు. అత్తా.. అల్లుడి మధ్య వచ్చే సన్నివేశాలు రసవత్తరంగా లేకపోవడంతో అంత ఆసక్తి లేకుండా పోయింది. అత్తా.. అల్లుడు పాత్రలు నువ్వా.. నేనా అన్నట్లు ఉండాలి.. కానీ ఈ సినిమాలో సన్నీవేశాలన్నీ తేలిపోయాయి. ఇక సినిమాలో కామెడీకి పెద్దగా స్థానం లేకపోవడంతో సినిమా అంతా బోర్ అనిపిస్తుంది.

ఎవరెలా చేశారంటే...
నాగచైతన్య ఎప్పటిలాగే హుషారుగా నటించాడు. అల్లుడి పాత్రలో ఒదిగిపోయాడు. అను ఇమాన్యుయేల్ తన అందం.. అభినయంతో ఆకట్టుకుంది. సీనియర్ నటి రమ్యకృష్ణ అత్త పాత్రలో ఒదిగిపోయేందుకు బాగా ప్రయత్నించింది. వెన్నల కిషోర్, పృద్విల కామెడీ కొంత పరవాలేదని అనిపించింది. మొత్తానికి శైలజారెడ్డి అల్లుడు సినిమా చాలా మందికి పెద్దగా నచ్చకపోవచ్చని చెప్పక తప్పడం లేదు.

గమనిక- ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం.

tags: sailajareddy alludu, sailajareddy alludu review, sailajareddy alludu movie review, sailajareddy alludud rating, sailajareddy alludu film, sailajareddy alludu film review

Related Post