ఆరోగ్యం, అందం ఉండాలంటే అదొక్క‌టి చేస్తే చాలాంటా..?

news02 June 21, 2018, 5:11 p.m. entertainment

tamanna yoga tips

హైద‌రాబాద్: మిల్స్ బ్యూటీ, పాల‌రాతి సుంద‌రీ, పుత్త‌డి బొమ్మ, హీరోయిన్ త‌మ్మన్నా అందం, నాజుగ్గా ఉండేందుకు కొత్త‌ భాష్యం చెబుతోంది.  ఆరోగ్యం, అందంగా ఉండాల‌నుకునే వారెవ్వ‌రైనా...తాను చెప్పిన సూత్రాలు పాటిస్తే చాలాంటోంది. రోజు క్ర‌మం త‌ప్ప‌కుండా ఈనియ‌మాల‌ను పాటిస్తే ఒత్తిళ్లు ద‌రి చేర‌క‌పోవ‌డ‌మే కాకుండా...బాడీ ఫిట్‌గా ఉండ‌డం ఖాయ‌మంటోంది. 

tamanna yoga tips

అయితే ఇలాంటీ అంద‌మైన, ఆరోగ్య‌క‌ర‌మైన జీవితాన్ని అనుభ‌వించాలంటే మాత్రం క్ర‌మం త‌ప్ప‌కుండా కొంత శ‌రీర‌క శ్ర‌మ చేయ‌డంతో పాటు ఆహార నియమాల్లో మార్పులు చేసుకోవాల‌ని సూచిస్తోంది. ప్ర‌తి రోజు యోగా,ధ్యానం త‌ప్ప‌ని చేయాల‌ని...త‌ద్వారా అనేకమైన ఒత్త‌డిల‌కు దూరం కావ‌చ్చ‌ని అంటోంది. యోగా చేయ‌డం వ‌ల‌నే సినిమా రంగంలో ఎన్నో ఒత్తిళ్లూ, స‌వాళ్లు, నిద్ర లేని ప‌నివేళ‌ల‌ను త‌ట్టుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోగ‌లిగాన‌ని తెలిపింది. 

tamanna yoga tips

అలాగే యోగాతో పాటు గోరువెచ్చటి నీళ్లూ, పొట్టుతీసిన బాదం తింటే ఇక ఆరోగ్యానికి ఏ ఢోకా ఉండ‌ద‌ని చెబుతుంది. ఆహార‌పు అల‌వాట్ల‌తో పాటు శారీర‌క శ్ర‌మ చేస్తే...ప్ర‌తికూల‌ ప‌రిస్థితుల‌ను సైతం సుల‌భం జ‌యించ‌వ‌చ్చ‌నీ..శ‌రీరంలోని టాక్సిన్లను కూడా బ‌య‌ట‌కు తీసేయొచ్చ‌నీ చెబుతోంది. అయితే త‌మ్మ‌న్నా చెప్పేది పాత విష‌యాలే అయినా...ఎంత మంది అభిమానులు ఆమె సూచ‌న‌ను పాటిస్తారో చూడాలి మ‌రి.

tamanna yoga tips

tags: tamanna yoga tips,

Related Post