వేర్ ఈజ్ స్టోరీ ?

news02 March 15, 2019, 8:03 p.m. entertainment

laxmi roy

సినిమా పిల్లర్- వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి సినిమా రివ్యూ మీకోసం........
సినిమా- వేర్‌ ఈజ్‌ ది వెంకటలక్ష్మి
తారాగణం- లక్ష్మి‌ రాయ్, రామ్‌ కార్తీక్‌, పూజిత పొన్నాడ‌, మ‌ధు నంద‌న్‌, ప్ర‌వీణ్, అన్న‌పూర్ణ‌, పంక‌జ్ కేస‌రి, జ‌బ‌ర్ద‌స్త్ మ‌హేష్ త‌దిత‌రులు.  
నిర్మాత‌లు- ఆనంద్‌రెడ్డి, శ్రీధ‌ర్‌రెడ్డి 
ద‌ర్శ‌క‌త్వం- కిషోర్ కుమార్ 

పరిచయం.......
తెలుగు చిత్ర‌సీమ‌ కామెడీ థ్రిల్ల‌ర్ క‌థ‌ల‌కి కేరాఫ్‌ అడ్రస్ గా నిలుస్తోంది. కామెడీ ధ్రిల్లర్ సినిమాలకు విజ‌యావకాశాలు ఎక్కువగా ఉండటంతో.. ద‌ర్శ‌క‌ నిర్మాత‌లు వీటిపై దృష్టి సారించారు. కాస్త కామెడీని రంగరించి.. కాస్త ఆస‌క్తి రేకెత్తించినా సక్సెస్ సాధించవచచ్ని వీరు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఏ చిన్న కాన్సెప్ట్ దొర‌ికినా దాని చుట్టూ క‌థ‌లు అల్లుకుపోతున్నారు. ఈ నేపధ్యంలో వచ్చిన సినిమానే వేర్ ఈజ్ ది వెంక‌ట‌ల‌క్ష్మి.  గతంలో ప‌లు హార‌్రర్ సినిమాల్లో నటించి మెప్పించిన లక్ష్మి రాయ్ ఈ సినిమాలో కీల‌క పాత్ర‌ పోషించింది. మ‌రి ఈ ముద్దు గుమ్మ మటించిన వేర్ ఈజీ ది వెంకటలక్ష్మి సినిమా ఎలా ఉందో చూసేద్దామా..

సినిమా కధ.........
చంటి (ప్ర‌వీణ్‌), పండు (మ‌ధునంద‌న్‌) ఆ ఊళ్లో అల్ల‌రి ప‌నులు చేస్తూ ఖాళీగా తిరుగుతుంటారు. ఆ ఉళ్లో ఎవ్వరి మాట వినని వీరిద్దరు.. త‌మ స్నేహితుడైన శేఖ‌ర్ (రామ్‌కార్తీక్‌) మాట మాత్రం వింటారు. ఇక ఆ ఊళ్లోకి వెంక‌ట‌లక్ష్మి ( లక్ష్మి రాయ్) టీచర్‌గా ఎంట్రీ ఇస్తుంది. ఇంకేముంది ఆమెను చూడ‌గానే ప్రేమలో పడ్డ వీరిద్దరు ఆమె ఏంచెప్పినా చేస్తుంటారు. ఈ క్రమంలో ఓ రోజు వెంక‌ట‌ల‌క్ష్మి దెయ్యం అనే విష‌యం వారిద్దరికి అర్దమవుతుంది. వాళ్లిద్దరికి తాను దెయ్యం అని తెలిసార.. వెంక‌ట‌ల‌క్ష్మి వారికి ఓ ప‌ని చెబుతుంది. మరి వెంకట లక్ష్మి చెప్పిన ఆ ప‌నిని ఆ ఇద్ద‌రూ చేశారా.. చేస్తే ఎవరి సాయం తీసుకున్నారు.. ఆసలు వెంకటలక్ష్మి చెప్పిన పనేంటీ.. ఇవన్నీ తెలియాలంటే మాత్రం సినిమా చూడాల్సిందే.. 

laxmi
సినిమా ఎలా ఉందో తెలుసా........
అప్పటివరకు అల్లరి చిల్లరగా తిరిగే ఇద్దరు యువకులు.. ఆ తరువాత అనుకోకుండా ఆ ఉరికి మంచి చేసే కధాంశమే వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి సినిమా. ఐతే ఆ మంచి ప‌నిని ఎవ‌రు ఎలా చేయించార‌న్న‌దే అసలైన కధ.  కామెడీ థ్రిల్ల‌ర్‌గా మలిచే  ప్ర‌య‌త్నం చేసినా.. ఆ ప్రయత్నం ఏ మాత్రం సక్సెస్ కాలేదని ఇట్టే అర్దమవుతుంది. సాధారనంగా ఇలాంటి కామెడీ ధ్రిల్లర్ సినిమాల్లో ప్రేక్షకులు లాజిక్‌ల గురించి అస్సలు ఆలోచించ‌రు. కానీ ఈ సినిమాలో ఏ పాత్ర ఎప్పుడు ఎలా ఎందుకు ప్ర‌వ‌ర్తిస్తుందో ఎవ్వరికీ అర్ధం కాదు. పండు, చంటి, వెంక‌ట‌ల‌క్ష్మిల క‌థ‌లోకి మిగతా పాత్రలు ఎందుకు వస్తాయో అంతా కన్ఫూజన్ గా ఉంటుంది. చంటి, పండు చేసే అల్ల‌రి ప‌నులు నవ్వు తెప్పించడానికి బదులు.. ఎబ్బెట్టుగా ఉంటాయి. అసలు వెంక‌ట‌ల‌క్ష్మి ఎవ‌రు.. ఆమె తీసుకుర‌మ్మ‌ని చెప్పిన పెట్టెలో ఏముంద‌నే విష‌యాన్ని చివరి వరకు సస్పెన్స్ గా ఉంచారు. ఇది ఆసక్తి రేపకపోగా.. అనవసరంగా సాగదీసినట్లు అనిపిస్తుంది. 

laxmi
అంతా ఇలా చేశారు....
మొత్తం నాలుగు పాత్ర‌ల చుట్టూ కధ తిరుగుతుంది. ప్ర‌వీణ్‌, మ‌ధునంద‌న్ చేసిన పండు, చంటి పాత్ర‌లే కాలకమైనా.. అవి పండించే కామెడీ మాత్రం తేలిపోయింది. నవ్వు రాకపోగా.. ఆయా సన్నీవేశాలన్నీ నవ్వులపాలయ్యాయని చెప్పవచ్చు. రామ్‌కార్తీక్‌, పూజిత పొన్నాడ ఒకటి రెండు సన్నీవేశాల్లో మాత్రమే బాగా చేశారనిపించారు. ఇక వెంక‌ట‌ల‌క్ష్మిగా నటించిన లక్ష్మి రాయ్ కేవలం  అందంగా క‌నిపించింది తప్పితే.. ఆమె పాత్ర  ను సరైన రీతిలో తీర్చిదిద్దడంలో డైరెక్టర్ పూర్తిగా విఫలమయ్యాడు. మొత్తానికి వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి సినిమా కి వెళ్తే వేర్ ఈజ్ స్టోరీ అని వెతుక్కోవాల్సిందే.

సినిమా పిల్లర్ రేటింగ్- 1/5
నోట్- ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. 
 

tags: where is the venkatalaxmi, where is the venkatalaxmi movie, where is the venkatalaxmi review, where is the venkatalaxmi movie review, where is the venkatalaxmi film, where is the venkatalaxmi ratinig

Related Post