News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

రేప్ గణాంకాల్లో ఇండియా ఎంతో మేలు

గత పది రోజుల వ్యవధిలో దేశవ్యాప్తంగా అమ్మాయిలపై అనేక అఘాయిత్యాలు జరిగాయి. హైదరాబాద్‌లో దిశ.. వరంగల్లో మానస.. తమిళనాడులో రోజా.. ఇలా కొన్ని రోజుల వ్యవధిలోనే చాలా మంది అమ్మాయిలు బలైపోయారు. దీనిపై దేశవ్యాప్తంగా రగడ నడుస్తోంది. తీవ్ర స్థాయిలో నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఈ విపరీత పరిణామాలపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.

ఐతే ఇదే అదనుగా విదేశీ మీడియా భారత్‌‌ను లక్ష్యంగా చేసుకుని వ్యతిరేక కథనాలు ప్రచురిస్తోంది. ఇండియాలో రేప్ కంట్రీగా నిలబెట్టే ప్రయత్నం చేస్తోంది. కానీ వాళ్లందరూ మరుగున పడేస్తున్న ముఖ్యమైన విషయాలు కొన్ని ఉన్నాయి. నమోదవుతున్న రేప్ కేసుల సంఖ్య పరంగా ఇండియా చాలా దేశాల కంటే ముందున్నప్పటికీ.. జనాభా పరంగా సగటు చూస్తే మాత్రం ఇండియా.. చాలా దేశాల కంటే ఎంతో మెరుగైన స్థితిలో ఉంది.

ఇండియాలో రేప్ ఘటనల మీద బీబీసీ ఇండియా ఒక వ్యతిరేక ప్రచురించింది. ఐతే ఇండియాతో పోలిస్తే జనాభా నిష్పత్తి ప్రకారం చూస్తే బ్రిటన్లో 80 రెట్లు అధికంగా రేప్ కేసులు నమోదవుతుండటం గమనార్హం. యుఎస్‌లో ఇండియాతో పోలిస్తే 30 రెట్లు అధికంగా రేప్‌లు జరుగుతున్నట్లు ఒక సర్వేలో వెల్లడి కావడం విశేషం. ఇదే విషయాన్ని ప్రముఖ వ్యాపారవేత్త మోహన్ దాస్ పాయ్ ప్రస్తావిస్తూ ఇండియాను రేప్ కంట్రీగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్న బీబీసీ మీద మండిపడ్డాడు.

- Advertisement -

ప్రోగ్రెసివ్ కంట్రీగా భావించే ఆస్ట్రేలియా.. మహిళలపై లైంగిక వేధింపుల్లో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉండటం గమనార్హం. అక్కడ లక్షమందిలో 17 వేల మంది మహిళలు ఈ రకమైన వేధింపులకు గురవుతున్నారట. కానీ ఇండియాలో మాత్రం లక్షమందికి ఒక్కరు కూడా వేధింపుల బారిన పడట్లేదు. 0.55 మంది మాత్రమే ఈ ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు జరుగుతున్న దారుణాలనూ అందరూ ఖండించాల్సిందే కానీ.. మనకంటే విదేశాల్లో దారుణమైన పరిస్థితులున్నందుకు మనం నయం అనుకోవాల్సిందే.

Tags: Foreign media, trying project, India as Rape Country

Leave A Reply

Your email address will not be published.