ఇంత‌కి వాడేం చేశాడు

news02 June 7, 2018, 12:47 p.m. general

12 mandi kapal

క‌రీంన‌గ‌ర్: మాములుగా ఎదైనా ప‌బ్లిక్ ప‌రీక్ష‌లు జ‌రిగితే...హాల్‌లో అనేక మంది విద్యార్థులు ప‌రీక్ష‌లు రాయ‌డం ప‌రిపాటి. ఇలా చాలా మంది విద్యార్థులు ప‌రీక్ష‌లు రాసిన‌ప్పుడు...ఇన్విజిలేట‌ర్ ఒక్క‌డే ఇంచార్జ్‌గా ఉండ‌డం తెలిసిందే. కానీ, క‌రీంన‌గ‌ర్ జిల్లా హుజురాబాద్‌లో బుధ‌వారం ఓఆస‌క్తిక‌ర స‌న్నివేశం చోటుచేసుకుంది. ప్ర‌భుత్వ ఉన్న‌త పాఠ‌శాల‌లో ఒక్క‌డే విద్యార్థి ప‌రీక్ష రాయ‌గా...వానికి 12 మంది సిబ్బంది కాప‌ల కాయ‌డం విశేషం. 
 

huzurabad

10వ త‌ర‌గ‌తి స‌ప్లిమెంట‌రీ హిందీ ప‌రీక్ష సంద‌ర్భంగా... హుజురాబాద్ జ‌డ్పీహెచ్ఎస్ సెంట‌ర్‌లో నిర్వ‌హించిన ప‌రీక్ష‌ల‌కు ఒక్క‌డే విద్యార్థి హాజ‌ర‌య్యాడు. మొత్తం ఈసెంట‌ర్‌లో 07గురు విద్యార్థులు ప‌రీక్ష‌లు రాయాల్సి ఉంది. అయితే ఏమైందో తెలియ‌దు కానీ, మిగ‌తా ఆరుగురు విద్యార్థులు ప‌రీక్ష‌కు డుమ్మా కొట్టారు. జ‌మ్మికుంట విద్యోద‌య పాఠ‌శాల‌కు చెందిన కోండ్ర ప్ర‌ణ‌య్ అనే విద్యార్థి మాత్ర‌మే హిందీ ప‌రీక్ష రాశాడు. దీంతో సెంట‌ర్‌లో ఒక్క‌డే విద్యార్థి ప‌రీక్ష రాసిన‌ప్ప‌టికీ...12 మంది సిబ్బంది విధులు నిర్వ‌హించాల్సిన విచిత్ర ప‌రిస్థితి త‌లెత్తింది. ఒక్క విద్యార్థి కోస‌మే  చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్ మెంటల్ అధికారి, ఇన్విజిలేటర్, క్లర్క్, అటెండర్, వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగి, ఇద్దరు కానిస్టేబుళ్లు త‌మ విధులు నిర్వ‌హించ‌డం విశేషం. అంతే కాదు వీరికి క‌రీంన‌గ‌ర్ నుంచి రెండు ప్ల‌యిగ్ స్వాడ్ బృందాలు కూడ రావ‌డం కొస‌మెరుపు. 

10 th exams

అయితే ఈవార్త విన్న స్థానికులు మాత్రం ముక్కున వేసేసుకుంటున్నారు. ఒక్క‌డి ఎగ్జామ్ కోసం ఇంత మంది సిబ్బందిని వినియోగించ‌డం నిజంగానే ఆశ్చ‌ర్యానికి గురిచేసిందంటున్నారు. అయితే ప‌రీక్ష రాసి ఆ ఒక్క విద్యార్థైనా మంచి మార్కుల‌తో ఎగ్జామ్‌లో పాసై హుజురాబాద్ ప‌రువు నిల‌బెడితే బాగుంటుంద‌ని చెబుతున్నారు. 

tags: jammikuta,huzurabad zphs,10th class public exams,kondra pranoy,scod,10th suplamentary exms,telangana 10th class exams,telangana 10th class exams results,telangana 10th class exams 2018,telangana 10th class exams 2018 results date,telangana 10th class exams 2017,telangana 10th class exams time table 2017,telangana 10th class exams 2017 results,telangana 10th class exam time table 2017,telangana 10th class exam time table,telangana 10th class exam schedule,telangana 10th class exam date,telangana 10th class exams time table,telangana 10th class board exam results telangana 10th class board exam time table,telangana 10th class board exams results,telangana 10th class board exam time table 2017,telangana 10th class exam date 2017,telangana 10th class exam fee,telangana board 10th class public exam hall ticket 2017 proof,telangana 10th class hindi exam paper,telangana board 10th class public exam hall ticket 2017,10th class exams in telangana,10th class exams in telangana 2017,10th class ex

Related Post