బిర్యానీ కోసం డీఎంకే నేత‌ల చిల్ల‌ర లొల్లి

news02 Aug. 2, 2018, 10:48 a.m. general

dmk

చెన్నై: డీఎంకే కురు వృద్దుడు క‌రుణానిధి అస్వ‌స్థ‌త‌కు గురైన విష‌యం తెలిసిందే. కొద్ది రోజులుగా ఆయ‌న ఆరోగ్యం బాగా లేక‌పోవ‌డంతో... క‌రుణానిధిని కావేరి ఆసుప‌త్రికి త‌ర‌లించి చికిత్స కూడా అందిస్తున్నారు. ఇప్ప‌టికే ఏఐసీసీ అధినేత రాహుల్ గాంధీతో పాటు ప‌లువురు ద‌క్షిణాది సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు కూడా ఆయ‌న‌ను ప‌రామ‌ర్శించారు. ఇక కార్య‌క‌ర్త‌లు కూడా ఆయ‌న‌ను చూసేందుకు భారీగానే త‌ర‌లివ‌స్తున్నారు. 

rahul

అయితే ఇంత వ‌ర‌కు బాగానే ఉన్న‌... క‌రుణానిధిని చూసేందుకు వ‌చ్చిన డీఎంకే కార్య‌క‌ర్త‌లు చెన్నైలో చేసిన ఓ చిల్ల‌ర ప‌ని ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. క‌రుణానిధి ఆసుప‌త్రిలో చేరిన రోజే ఆయ‌న‌ను చూసేందుకు వ‌చ్చిన డీఎంకే కార్య‌క‌ర్త‌లు.. బిర్యాని కోసం చెన్నైలోని ఓ హోట‌ల్ యాజ‌మానితో గొడ‌వ‌కు దిగ‌డం విశేషం. విరుగంబాకంలోని ఎస్‌ఎస్‌ హైదరాబాద్‌ బిర్యానీ హోటల్‌లో కొద్ది రోజుల క్రితం ఈ ఘటన చోటుచేసుకుంది. డీఎంకే కార్యకర్తలు హోటల్‌కు వచ్చి తమకు బిర్యానీ కావాలని ఆర్డర్‌ చేశారు. అయితే, బిర్యానీ లేకపోవడంతో అదే విషయాన్ని వారికి హోటల్‌ సిబ్బంది చెప్పేశారు. దీంతో చెల‌రేగిపోయిన డీఎంకే నాయ‌కులు...స‌ద‌రు హోట‌ల్ నిర్వాహ‌కుల‌తో వాగ్వాదానికి దిగి... వారిని చిత‌క‌బాదేశారు. 

dmk

ఇక ఇదే విష‌యం ఇప్పుడు సోష‌ల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్‌పై చ‌క్క‌ర్లు కొడుతుండ‌డంతో... నెటిజ‌న్లు డీఎంకే కార్య‌క‌ర్త‌ల‌పై ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేస్తుండ‌డం విశేషం. ఒక వైపు వారి నాయ‌కుడు ఆసుప‌త్రిలో అవ‌స్థ‌లు ప‌డుతుంటే వీరు మాత్రం... బీరు, బిర్యానిలంటూ ఎంజాయ్ చేయ‌డ‌మేంటని మండిప‌డుతున్నారు. స‌ద‌రు డీఎంకే నేత‌ల ప‌రిస్థితి చూస్తుంటే శ‌వంపై పేలాలేరుకున్న చందంగా ఉందంటూ.. సెటైర్లు వేస్తున్నారు. అయితే ఇక ఈ విష‌యం సోష‌ల్ మీడియాలో విప‌రీత‌మైన ప‌బ్లిసీటి కావ‌డంతో... హోట‌ల్‌లో చిల్ల‌ర పంచాయితీ చేసిన నేత‌ల‌పై డీఎంకే అధిష్టానం స‌స్పెన్ష‌న్ వేటు వేయ‌డం కొస‌మెరుపు.

tags: dmk,dmk,hotel,staff,Chennai,viral video,Karunanidhi,hyderabad biryani,chennai,dmk leaders,dmk party,hospital,rahul gandhi,tamilnadu,tamilnadu politics,tamil political parties,aidmk,dmk party logo,dmk party symbol

Related Post