News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

ఇక బంగారాన్ని కొన‌గ‌ల‌మా..?

పంచ వ్యాప్తంగా నెల‌కొన్న ఆర్థిక మాంద్యం దెబ్బ‌కు బంగారం ధరలు భగ్గుమన్నాయి. ఊహించని విధంగా గోల్డ్ ధరలు పెరిగాయి. సోమవారం పసిడి ధరలు పాత రికార్డులను బ‌ద్ద‌లు కొట్టి..ఆల్ టైమ్ రికార్డ్ సెట్ చేశాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.40వేలు క్రాస్ అయ్యింది. స్టాక్ మార్కెట్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.40వేల 260గా ఉంది. అదే హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.40వేల 240గా నమోదైంది. ముంబైలో రూ.39వేల 851గా ఉంది. విజయవాడ, విశాఖలో రూ.39వేల 850గా ఉంది. ఇక  వెండి ధరలు విషయానికి వస్తే కిలో వెండి ధర రూ.45వేలుగా ఉంది. 5 రోజుల క్రితం గోల్డ్ రేట్ రూ.38వేల 885గా ఉంది. పదేళ్ల క్రితం 10గ్రాముల బంగారం ధర రూ.14వేలు మాత్రమే ఉండేది.

gold_rates_hyke.j

ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం భయాలతో ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడిగా గోల్డ్ వైపు మొగ్గు చూపుతున్నారు. అమెరికా-చైనా ట్రేడ్ వార్ కూడా గోల్డ్ ధరలు పెరగడానికి కారణం. దేశంలో శుభకార్యాలు, పండగ సీజన్లు కావడం.. రూపాయి బలహీనపడి డాలర్(రూ.72) బలపడటం కూడా గోల్డ్ రష్ కి కారణం అని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ఉండటం, దేశీయంగా ఉన్న ఆటోమొబైల్ రంగం షేర్లు లాస్ లో ఉండటం కూడా పుత్తడి రేట్లు పెరగడానికి కారణంగా చెబుతున్నారు. ఈ పరిణామాలతో ఇన్వెస్టర్లు సేఫ్ సైడ్ గా గోల్డ్, సిల్వర్ వైపు మొగ్గు చూపుతున్నారు.

gold_price_record_break.

జెట్ స్పీడ్ తో పెరిగిపోతున్న బంగారం ధరలతో పేద, మధ్య తరగతి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇక జీవితంలో గోల్డ్ కొనగలమా అని సందేహిస్తున్నారు. దీపావళి నాటికి రూ.42వేల మార్కుని తాకిని ఆశ్చర్యపోనక్కర్లేదని వ్యాపార వ‌ర్గాలు చెబుతుండ‌టం.. గొల్డ్ ల‌వ‌ర్స్ ను మరింత టెన్షన్ పెడుతుంది

Tags: gold price, record break, fourty thousand rupees, stak market, gold, financial crise, world market, india, hyderabad, gold market

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.