ఓకే గూగుల్ అనగానే .. మీ మొబైల్ లో ఎస్ ప్లీజ్ అంటూ గూగుల్ అసిస్టెంట్ రెడీ అయిపోతాడు. అయితే ఇదంతా ఇంగ్లీష్ లో మాత్రమే సాధ్యం. కానీ ఇప్పుడు ఈ సంభాషణని తెలుగులో కూడా జరపొచ్చు. అవును గూగుల్ అసిస్టెంట్ తెలుగులో కూడా వస్తోంది. తెలుగు తో పాటు .. హిందీ, కన్నడ, బెంగాళీ, తమిళం .. ఇలా తొమ్మిది ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు ఎవరి చేతిలో చూసినా స్మార్ట్ ఫోన్ కనిపిస్తుంది. అందులో అందరూ గూగుల్ ను వాడుతుంటారు కానీ .. గూగుల్ అసిస్టెంట్ ని తక్కువగా వాడుతుంటారు. అందుకే గూగుల్ అసిస్టెంట్ ను అందరికీ దగ్గరగా చేయడానికి గూగుల్ అసిస్టెంట్ ను ప్రాంతీయ భాషల యూజర్లకు చేరువ చేస్తున్నారు. అసిస్టెంట్ గతంలోనే హిందీలో పని చేసేది. దానికి కోసం డివైజ్ లాంగ్వేజ్ మార్చుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ ఇబ్బంది లేకుండా నేరుగా అసిస్టెంట్ తో హిందీలో మాట్లాడుకోవచ్చు. అలాగే ఇతర ఎనిమిది భాషల్లో కూడా మాట్లాడవచ్చు.
ఇన్నాళ్లూ ఇంగ్లిష్ భాషలో పని చేస్తూ వచ్చిన స్మార్ట్ స్పీకర్స్, స్మార్ట్ ఫోన్స్, కంప్యూటర్లు ఇకపై ప్రాంతీయ భాషల్లో కూడా పనిచేస్తాయి. రీజనల్ లాంగ్వేజ్ సదుపాయం వినియోగించుకోవాలంటే గూగుల్ యాప్ ను ముందుగా అప్డేట్ చేసుకోవాలి. భారత వినియోగదారులు గూగుల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ ను మార్చుకోవడం ఇకపై చాలా సులభం. దీని కోసం గతంలోలా సిస్టమ్ లాంగ్వేజ్ మార్చక్కర్లేదు. గూగుల్ అసిస్టెంట్ ను ఓపెన్ చేసి హే గూగుల్ టాక్ టు మి ఇన్ తెలుగు అని కమాండ్ ఇవ్వాలి. దీని కోసం మీ మొబైల్ లో ఎలాంటి సెట్టింగ్స్ మార్చాల్సిన అవసరం లేదు. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ సహా .. ఆండ్రాయిడ్ గో ఫోన్లలోనూ ఈ ఫీచర్ ను వాడొచ్చు.
Tags: GOOGLE, GOOGLE SURCHING,ENGLISH, HINDI, TELUGU, LANGUAGES, GOOGLE SURCHING IN TELUGU