News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

సానుకూలంగా స్పందించిన గవర్నర్ ..!

హైదరాబాద్​ : తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎమ్మెల్యేల పార్టీ పిరాయింపులపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కు పిర్యాదు చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​ కుమార్​ రెడ్డి నేతృత్వంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పలువురు ఎమ్మెల్యేలు రాజ్​భవన్​లో గవర్నర్​ తో భేటి అయ్యారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టీఆర్ఎల్పీ లో విలీనం అప్రజాస్వామికమని గవర్నర్కు ఫిర్యాదు చేశారు.

Governor

రాష్ట్ర గవర్నర్​ గా తమిళిసై సౌందరరాజన్​ వచ్చిన తరువాత తొలిసారి రాజ్​భవన్​లో మర్యాదపూర్వకంగా ఆమెను కలిసిన హస్తం నేతలు .. పార్టీ ఫిరాయింపులు, ఎమ్మెల్యేల విలీనం వంటి అంశాలతో పాటు రాష్ర్టంలో జరుగుతున్న ప్రజాస్వామిక విధానాలపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఎమ్మెల్యేలు పార్టీ మారిన తేదీలతో సహా ఫిరాయింపు ఆధారాలు ఇచ్చినట్లు సమావేశం అనంతరం భట్టి విక్రమార్క మీడియాకు వివరించారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం తగిన చర్యలు చేపడతామని తమిళిసై హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు.

- Advertisement -

Governor

Tags: GOVERNOR,TAMILISAI,RAJBHAVAN, UTTAM KUMAR REDDY, BHATTI VIKRAMARKA,SRIDHAR BABU,CLP,TRS MLAS, ASSEMBLY,CONGRESS MLAS,BJP, GANDHIBHAVAN,TRS BHAVAN

Leave A Reply

Your email address will not be published.