News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

ఇంటర్ బాలిక ప్రాణం తీసిన ప్రేమోన్మాదం?

చదువుకునేందుకు మేడ పైకి వెళ్లిన విద్యార్థిని
రెండు అపార్టమెంట్ల మధ్య విగతజీవిగా పడివున్న వైనం
అత్యాచారం చేసి మేడపై నుంచి తోసిసినట్టు అనుమానం
ప్రేమోన్మాదం మరో బాలికను బలితీసింది. చిలకలగూడ పరిధి వారాసిగూడలో రెండు అపార్ట్ మెంట్ల మధ్య విగతజీవిగా పడివున్న బాలిక మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. ఇంటర్ చదువుతున్న బాలిక పై మేడపై అత్యాచారం చేసి అనంతరం కిందికి తోసి హత్య చేసినట్టుగా అనుమానిస్తున్నారు. పోలీసులు, స్థానికుల కథనం మేరకు…వారాసిగూడలోని ఓ అపార్ట్ మెంట్లో ఈ బాలిక తల్లి, తమ్ముడు, సోదరితో కలిసి ఉంటోంది. ఏడాది క్రితమే తండ్రి చనిపోయాడు. షోయబ్ అనే యువకుడు చాలా రోజులుగా ప్రేమ పేరుతో ఈమె వెంట పడుతున్నాడు. తాను ఆ బాలికను పెళ్లి చేసుకుంటానని, ఆమె తల్లితో మాట్లాడి రావాల్సిందిగా తన కుటుంబ సభ్యులను కూడా పం పినట్లు సమాచారం.

అయితే తన కుమార్తె మైనర్ అని, చదువుకుంటోదని, తనకు ఇప్పుడే పెళ్లి చేసే ఉద్దేశం లేదని ఆమె తల్లి తిరస్కరించింది. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి చదువుకునేందుకని బాలిక మేడ పైకి వెళ్లింది. ఎప్పటికీ తిరిగి రాలేదు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు మేడ పైన, చుట్టుపక్కల వెతికినా ప్రయోజనం కనిపించలేదు.

- Advertisement -

ఈ రోజు ఉదయం అపార్ట్ మెంట్ లోని ఓ మహిళ మేడ పైకి వెళ్లింది. ఓచోట రక్తపు మరకలు కనిపిం చడంతో అనుమానంతో అటువైపు తొంగిచూడగా రెండు భవనాల మధ్య పడివున్న బాలిక కనిపించింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో వారు భోరుమన్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు.

మేడ పై ఉన్న పరిస్థితులు, రక్తపు మరకలు గమనించిన పోలీసులు బాలికను మేడ పై నుంచి కిందికి తోసేసే ముందు ఆమెను తీవ్రంగా హింసించారని, అత్యాచారం కూడా చేసి ఉండవచ్చునని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే పోస్టుమార్టం రిపోర్టు వచ్చే వరకు ఏ విషయం చెప్పలేమని పోలీసులు తెలిపారు.
Tags: inter student,murder,varasiguda,hyderabad

Leave A Reply

Your email address will not be published.