News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

కేసీఆర్ వార్నింగ్ .. లైట్ లేలో..!!

  • ఆర్టీసీ స‌మ్మేపై.. చ‌ట్టం ఏం చెబుతోంది.?
  • గ‌ట్టు మీద కేసీఆర్.. మెట్టు దిగ‌ని కార్మికులు.
  • కార్మికుల‌కు ఇచ్చిన సీఎం డెడ్ లైన్ ముగిసింది.
  • ఆర్టీసీలో రూట్ల‌న్నీ ప్ర‌వేట్ ప‌రం కాబోతున్నాయా.?
  • ఆర్టీసీని ప్రైవేట్ ప‌రంకు చ‌ట్టం ఓకే అంటుందా.?

తెలంగాణ‌లో ఆర్టీసీ కార్మికులు మ్రోగించిన స‌మ్మే నెల రోజులు దాటింది. ప్ర‌భుత్వం చ‌ర్చ‌లు ప్రారంబిస్తే త‌ప్పా.. స‌మ్మెను విర‌మించేది లేదంటు.. ఆర్టీసీ కార్మికులు భీష్మించుకుని కూర్చుకున్నారు. మ‌రోవైపు స‌మ్మెపై హైకోర్ట్ లో వాద‌న‌లు కొన‌సాగుతున్నాయి. ఇంకోవైపు .. స‌మ్మెను విర‌మించి.. విధుల్లో చేరాల‌ని .. లేదంటే.. భ‌విష్య‌త్ లో ఆర్టీసీ లేని తెలంగాణ ను మీరు చూస్తారంటూ.. సీఎం కేసీఆర్ కార్మికుల‌కు అల్టీమేట‌మ్ ఇచ్చారు. ఇప్పుడు సీఎం అల్టీమేట్ గ‌డువు కూడా ముగిసింది. అల్టీమేట‌మ్ తో.. కార్మిక‌లు అంద‌రూ విధుల్లో చేరిపోతార‌ని అనుకున్న‌ ప్ర‌బుత్వ ఆశలు నెర‌వేర‌లేదు. సీఎం వ్యాఖ్య‌ల‌పై కార్మికుల్లో ఎలాంటీ భ‌వ‌యం కూడా క‌న‌బ‌డ‌లేదు. దీనికి ఈ మూడు రోజుల్లో విధుల్లో చేరిన ఆర్టీసీ ఉధ్యోగుల సంఖ్య‌నే అద్దం ప‌డుతుంది. తెలంగాణ‌లో యాబై వేల ఆర్టీసీ కార్మికులుంటే.. అందులో కేవ‌లం మూడు వందల మంది కార్మికులు మాత్ర‌మే విధుల్లో చేరారు. దీనితో ఇప్పుడు ఏం జ‌ర‌గ‌బోతుంది.? అన్న‌ది ఉత్కంఠ‌త రేపుతుంది.

tsrtc jac members, today rtc strike,

- Advertisement -

ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన విధంగా.. కార్మికులు విధుల్లో చేర‌క‌పోతే.. ఆర్టీసీని ప్ర‌వేట్ ప‌రం చేయ‌డం ఖాయ‌మ‌ని.. ఇప్ప‌డికే సిఎం కేసీఆర్ ప్ర‌క‌టించారు. అంటే.. ఇప్ప‌డికే ప్ర‌క‌టించిన ఐదు వేల రూట్ల‌కు తోడు.. మిగ‌తా ఐదువేల రూట్ల‌లో కూడా.. ప్ర‌వేట్ వ్య‌క్తుల‌కు రూట్ ప‌ర్మిష‌న్ లు ఇవ్వ‌డం ఖ‌యామ‌ని అంటుంది ప్ర‌భుత్వం. అయితే సీఎం ఇచ్చిన డెడ్ లైన్ కొట్టిపారేస్తుంది ఆర్టీసీ జేఏసీ. అస‌లు ఆర్టీసీ ఉధ్యోగులను తొలిగించే అదికారం ప్ర‌భుత్వానికి లేనే లేదంటుంది. దీనికి గాను ఆర్టీసీ జేఏసీ 1950 రోడ్ ట్రాన్స్ పోర్ట్ యాక్ట్ ను ప్ర‌స్తావిస్తున్నారు జేఏసీ నేత‌లు. ఆ చ‌ట్టం ప్ర‌కారం.. ఆర్టీసీలో కేంద్రాని 31 శాతం వాట ఉండ‌గా.. రాస్ట్రానికి 69 శాతం ఉంది. కాబ‌ట్టి.. ఆర్టీసీ 1950 యాక్ట్ లోని సెక్ష‌ణ్ 39.1 ప్ర‌కారం ఆర్టీసీ ఆస్థిత్వాన్న దెబ‌బ్తీసే ఏ నిర్ణ‌యం తీసుకున్నా.. కేంద్రం అనుమ‌తి, ఆమోదం త‌ప్ప‌నిస‌రి అంటున్నారు. ఇక సెక్ష‌న్ 39.2 ప్ర‌కారం.. ఆర్టీసీని మూసి వేయాలంటే.. ముందు కేంద్ర అమోదం త‌ప్ప‌నిస‌రి.. దీనికి తోడు.. రాష్ట్ర విభ‌జ‌న‌లో .. ఇప్ప‌డి వ‌ర‌కు ఆర్టీసీ ఆస్తుల పంప‌కాలు పూర్తి కాలేదు కాబట్టీ.. మ‌మల్నీ తొలిగించే అదికారం సీఎం లేదన్న ధీమా కార్మికుల్లో ఉంది.

staff-cm-kcr-ashwathama-reddy-telangana-rtc-rtc-employeesఅయితే ప్ర‌భుత్వం తాజాగా కేంద్ర‌ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన‌.. 2019 ర‌వాణ చ‌ట్టం ప్ర‌కారం ఆర్టీసీలో రూట్ల‌ను .. ప్రైవేట్ ఇచ్చే అధికారం ప్ర‌బుత్వానికి ఉందంటుంది స‌ర్కార్. ఈ నూతన చట్టంలోని సెక్షన్ 67లోని సబ్ సెక్షన్ 1డి ప్రకారం…. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు ప్రైవేటు సర్వీసులను ఉపమోగించే వేసులు బాటు కేంద్రం రాష్ట్రాల‌కు క‌ల్పించింది అని.. దీనికి రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌త్యేకంగా అనుమ‌తి తీసుకోవాల్సిన అవ‌స‌రం లేదంటుంది. దీంతో.. ఓక‌వైపు 1950 ఆర్టీసీ యాక్ట్ మాకు ర‌క్ష‌ణ క‌వ‌చమ‌ని ఆర్టీసీ కార్మికులు.. మ‌రోవైపు.. కేంద్రం తెచ్చిన చ‌ట్టంతో.. ఆపాత చ‌ట్టం క‌థ ముగిసింద‌ని ప్ర‌భుత్వం ఇలా ఎవ‌రికి వారు.. ధీమాతో ముందుకెళుతున్నారు. దీనితో.. తాను ఇచ్చిన గ‌డువు ముగియ‌డంతో.. ఇప్పుడు సీఎం కేసీఆర్ ఏంప్ర‌క‌ట‌న చేయనున్నార‌న్న‌ది.. స‌ర్వ‌త్రా ఉత్కంఠ‌త రేపుతుంది.

Tags: tsrtc jac members, today rtc strike, cm kcr comments on tsrtc, today meeting,1950 road act, warning

80%
Awesome
  • Design

Leave A Reply

Your email address will not be published.