News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

ఆటో డ్రైవర్ పై ‘ఐటి దాడులు’

అదేంటి?. ఆటో డ్రైవర్ పై ఐటి దాడులు ఏంటి? అని ఆశ్చర్యపోతున్నారా.. ఔను. ఇది పక్కా నిజం. ఇందులో ఏ మాత్రం సందేహం లేదు. ఎందుకంటే ఆ ఆటోడ్రైవర్ బెంగుళూరులోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో ఏకంగా రెండు కోట్ల రూపాయల విలువైన ఓ విల్లా కొనుగోలు చేశారు. అదే ఆయనపై ఐటి దాడికి కారణమైంది. ఆటో డ్రైవర్ పై ఐటి దాడులు జరిగాయన్న వార్త బెంగుళూరులో ఓ హాట్ టాపిక్ గా కూడా మారింది. బెంగుళూరులోని మహదేవపుర నియోజకవర్గ పరిధిలో ఈ దాడులు జరిగాయి. ఇక్కడ ఉంటే ఆటోడ్రైవర్ సుబ్రమణి చాలా పాపులర్. దీంతో ఆయన ఖరీదైన వైట్ ఫీల్డ్ లో విల్లా కొన్న వ్యవహారం ఆ నోటా..ఈ నోటా పాకి ఏకంగా ఐటి అధికారులు కూడా చేరింది.

- Advertisement -

                                       అంతే ఓ రోజు ఆయన ఇంటిపై దాడులు చేస్తే ఆశ్చర్యపోవటం ఐటి శాఖ అధికారుల వంతు అయింది. ఎందుకంటే అక్కడ వాళ్ళకు భారీ ఎత్తున డాక్యుమెంట్లు లభించాయి. అందులో అత్యంత విలువైన ఆస్తులకు సంబంధించిన పత్రాలు ఉండటం విశేషం. ఐటి దాడుల్లో దొరికిన ఫోటోలను పట్టి చూస్తే ఆయనకు బెంగుళూరుకు చెందిన కొంత మంది బిజెపి నేతలతో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో పెద్ద వైరల్ గా మారింది.

Leave A Reply

Your email address will not be published.