News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

వైఎస్ జ‌గ‌న్ కు .. ఎల్వీ చేసిన పాపం ఏంటీ.?

  • పాపం.. ఎల్వీసుబ్ర‌మ‌ణ్యం.!
  • చేసుకున్నోడికి చేసుకున్నంత మ‌హ‌దేవా.!
  • మ‌ణికొండ రైతుల పాపం ఎల్వీకి తాకిందా.?

బ్యాంక్ మేనేజ‌ర్ ను ..ఆ బ్యాంక్ లో ప‌నిచేసే క్ల‌ర్క్ స‌స్పెండ్ చేస్తారా… ? అదేంటీ మైండ్ లేని ప్ర‌శ్న అనుకుంటున్నారా.. ? కాని ఇది నిజం. అవును ఇదే నిజ‌మే అని నిరూపించారు ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. ఇదేమి చోద్యం రా బాబు అనుకుంటు ఆశ్య‌ర్య‌పోకండి. ఇప్పుడు అస‌లు విష‌యానికి వ‌ద్దాం.. సీఎస్ అంటే.. ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి. ఈయ‌న రాష్ట్రంలో ప్ర‌భుత్వ అదికారుల అంద‌రికి సుప్రిం. రాష్ట్రంలో ఏ క‌లెక్ట‌ర్ ఎక్క‌డ ప‌నిచేయాలి.. ప్ర‌భుత్వ శాఖ‌ల్లో ముఖ్య కార్య‌ద‌ర్శులుగా ఎవ‌రుండాలి.. అన్న‌ది ఆయ‌న ఆమోదంతోనే నియ‌మించ బ‌డ‌తారు. అలాగే వారిని బ‌దిలీ చేయాల‌న్నా ఆయ‌న‌కే అదికారం ఉంటుంది. కాని ఈ సాంప్ర‌దాయాన్ని బ్రేక్ చేశారు ఏపీ సిఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. సీఎస్ కంటే త‌క్కువ హోదా ఉండే అదికారితో ఏకంగా ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శినే బ‌దిలీ చేయించారు. అవును.. ఏపీ సిఎస్ గా పినిచేస్తున్న ఎల్వీసుబ్ర‌మ‌ణ్యం ను.. సీఎం ముఖ్య కార్య‌ద‌ర్శిగా ఉన్న ప్ర‌వీణ్ ప్ర‌కాష్ తో బ‌దీలీ చేయిస్తూ ఉత్వ‌ర్వులు ఇప్పించి రికార్డ్ సృష్టించారు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. ఎక్క‌డైనా.. మ‌ఖ్య కార్య‌ద‌ర్శుల‌ను .. ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్తి బ‌దిలీచేస్తుంటారు.. కాని ఇక్క‌డ అంతా రివ‌ర్స్ లో క‌థ న‌డిపించారు జ‌గ‌న్. మ‌రి ఇంత‌లా జ‌గ‌న్ ఎందుకు చేశారు అన్న‌దే ఇప్పుడు సర్వ‌త్రా ఆస‌క్తి రేపుతుంది. జ‌గ‌న్ కు క‌నీసం ప‌రిపాల‌న‌, సీఎస్ అధికారాల‌పై అవ‌గాహ‌న లేక ఇలా చేశారా..? లేక ఎల్వీసుబ్ర‌మ‌ణ్యంపై క‌సితో ఇలా చేశారా.. ? ఇంతగా జ‌గ‌న్ కు కోపం వ‌చ్చే విధంగా.. ఎల్వీపుబ్ర‌మ‌ణ్యం ఏం చేశారాబ్బా..?

అవును ఎల్వీ సుబ్ర‌మ‌ణ్యం ను జ‌గ‌న్ ఏరికోరి.. సీఎస్ గా తెచ్చుకున్నార‌న్న‌ది పోలిటిక‌ల్ స‌ర్కిల్లో చ‌ర్చుంది. అవును.. ఎన్నిక‌ల వేల‌.. టీడిపిని దెబ్బ‌ కొట్టేందుకు.. నాటీ సీఎస్ చంద్ర‌బాబుకు అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారని.. వైసీపీ ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి డిల్లీలో పిర్యాదు చేయ‌డం.. ఆ వెనువెంట‌నే.. ఎల్వీని ఏపీకి సీఎస్ గా ఎన్నిక‌ల క‌మీషన్ నియ‌మించ‌డం చక‌చ‌కా జ‌రిగిపోయింది. ఇక ఎల్వీ కూడ‌.. ఎన్నిక‌ల్లో అవుటాలాఫ్ లైన్ .. జ‌గ‌న్ కూ అనుకూలంగా న‌డుచుకున్నార‌ని,.. ఎన్నిక‌ల్లో టిడిని నేత‌లను త‌న అదికారాల‌తో ముప్ప తిప్ప‌లు పెట్టారన్న విమ‌ర్శ‌లు ఉన్నాయి. ఇక ఎల్వీ పూర్వావ్ర‌మంలో వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి సీఎంలో ప్రిన్సిపల్ సెక్ర‌ట‌రీ గా ఉన్న ఎల్వీ.. ఎమ్మార్ ప్రాప‌ర్టీసీ కేస్ లో జ‌రిగిన క్విడ్ ప్రో కోలో.. జ‌గ‌న్ కు స‌హ‌క‌రించార‌ని.. దీనిలో ఎమ్మార్ ప్రాప‌ర్టీలో నాలుగు రాళ్ళు బాగానే వెన‌కేసుకున్నార‌న్న ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. నాడు హైద‌రాబాద్ లోని మ‌ణికొండ లో ఎమ్మార్ ప్రాప‌ర్టీకి 535 ఎక‌రాల కేటాయింపు.. నిభంధ‌న‌లు తుంగ‌లో తొక్కి ఎమ్మార్ కు జ‌గ‌న్ కోసం స‌హ‌రించార‌ని..ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

- Advertisement -

అంతేకాదు.. ఈ కేసులో సీబిఐ సైతం.. ఎల్వీనీ విచారించింది. అప్పుడు జ‌గ‌న్ కు.. వైఎస్ కు విధేయుడుగా ఉన్న ఎల్వీని.. కావాల‌నే జ‌గ‌న్ సీఎస్ గా ఏరీ కోరి సీఎస్ గా తెచ్చుకున్నారు. మ‌రి అలా తెచ్చ‌కున్న ఎల్వీనీ ఇప్పుడు ఇలా అవ‌మానించ‌డం ఏంటీ.. అన్న‌దే ఇప్పుడు అంద‌రిని వేదిస్తున్న ప్రశ్న‌. ఏది ఏమైనా.. గ‌తంలో వైఎస్ఆర్ సీఎంగా ఉన్న‌ప్పుడు జ‌గ‌న్ .. క్విడ్ ప్రో కో స‌హ‌క‌రించి.. మొన్న ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ గెలిచేందుకు త‌న శ‌క్తి యుక్తులు అన్నీ దార‌పోసిన ఎల్వీ సుబ్ర‌మ‌ణ్యంకు .. సీఎం గా జ‌గ‌న్ ఇలా అవ‌మాన‌క‌ర రీతీలో సాగ‌నంప‌డం మాత్రం.. అంద‌రిని ఆశ్య‌ర్యానికి గురిచేస్తుంది. మ‌రి అదే అంటారు.. చేసుకున్నోడికి చేసుకున్నంత మ‌హ‌దేవా అని.!!

Tags: Jagan Mohan Reddy, shunts, AP CS, lv subramanyam, ap politics

80%
Awesome
  • Design

Leave A Reply

Your email address will not be published.