News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

ఆమే కావాలంటున్న బన్నీ

  • మళ్లీ కాజల్ ఐటెం సాంగ్

అందాల భామ కాజల్ అగర్వాల్ కు వయసు పెరుగుతున్న కొద్ది ఇండస్ట్రీలో మరింత డిమాండ్ పెరుగుతోంది. అందులోను కాజల్ ఐటెం సాంగ్ కు ప్రేక్షకుల్లో చాలా క్రేజ్ ఉంది. ఆ మధ్య జూనియర్ ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ సినిమాలో ఈ ముద్దుగుమ్మ ఐటెం సాంగ్ చేసి అందరి చూపు తనవైపు తిప్పుకుంది. కాజల్ అగర్వాల్ చేసిన ఈ ఐటెం సాంగ్ కు అప్పట్లోనే కోటి రూపాయాల రెమ్యునరేషన్ తీసుకుందట. ఆ పాట కూడా చాలా పాపులర్ అయ్యింది. ఇదిగో ఇప్పుడు అల్లు అర్జున్ నటిస్తున్న అల వైకుంఠపురములో సినిమాలోను కాజల్ ఐటెం సాంగ్ ఉండబోతోందని తెలుస్తోంది.

- Advertisement -

ఈ సినిమాలో ఐటెం సాంగ్ కోసం కాజల్ ని తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ముందు ఈ సినిమాలో ఐటెం సాంగ్ కోసం హాట్ యాంకర్ అనసూయను తీసుకోవాలనుకున్నారట. ఐతే అల్లు అర్జున్ మాత్రం కాజల్ కోసం పట్టుపడుతున్నాడని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. ఇక కాజ‌ల్ అగర్వాల్ ప్రస్తుతం జాన్ అబ్రహం ముఖ్య పాత్ర పోషిస్తున్న ముంబై స‌గా అనే హిందీ సినిమా, మ‌రోవైపు కమల్-శంకర్ ల ఇండియ‌న్ 2 సినిమాల్లో నటిస్తోంది. మరి ఎలాగైనా తన సినిమాలో కాజల్ చేత ఐటెం సాంగ్ చేసించాలని పట్టుబడుతున్న అల్లు అర్జున్ కోరిక ఎంత మేరకు నెరవేరుతుంతో చూడాలి మరి.

Leave A Reply

Your email address will not be published.