News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

ఉద్యోగుల్లో చీలిక కోసం కేసీఆర్ యత్నం

  • విభజించు పాలించు అంటున్న కేసీఆర్
  • ఆర్టీసీ కార్మికులకు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాల మద్దతు

తెలంగాణలో ఆర్టీసీ సమ్మె అంతకంతకు ఉదృతం అవుతోంది. ఆర్టీసీ కార్మికులకు రోజు రోజుకు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాల మద్దతు పెరుగుతోంది. దీంతో కేసీఆర్ ప్రభుత్వంలో కంగారు మొదలైంది. తెలంగాణ సాధన సమయంలో ఎలాగైతే సకల జనుల సమ్మె చేశారో.. అదే విధంగా ఆర్టీసీ సమ్మె  అందరి మద్దతుతో సకల జనుల సమ్మెలా మారబోతోందని వాదన ప్రభుత్వానికి నిద్ర లేకుండా చేస్తోంది. దీంతో ఉద్యోగులందరిని ఏకతాటిపైకి రాకుండా.. మిగతా ఉద్యోగ సంఘాల మద్దతు ఆర్టీసీ కార్మికులకు దక్కకుండా కేసీఆర్ సర్కార్ ప్రయత్నాలు మొదలుపెట్టిందన్న చర్చ జరుగుతోంది. విభజించి పాలించు అన్న సూత్రాన్ని అనుసరించి.. ఉద్యోగుల్లో చీలిక తీసుకువచ్చేందుకు పావులు కదుపుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

- Advertisement -

ఒకరు ఇద్దరు కాదు.. ఏకంగా 45వేల మంది ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె బాట పట్టడం.. వారికి ప్రజలు, రాజకీయ పార్టీలు, పలు సంఘాలు మద్దతు తెలపడంతో సీఎం కేసీఆర్ మిగతా ఉద్యోగ సంఘాలును మచ్చిక చేసుకునే పనిలో పడ్డారని తెలుస్తోంది. అందులో భాగంగానే టీఎన్జీఓ సంఘం నేతలను ఉన్న ఫలంగా ప్రగతి భవన్ పిలిపించికున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. వారి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే టీఎన్జీఓ సంఘం నాయకులతో ఓ సమావేశాన్ని ఏర్పాటు చేస్తానని.. ఉద్యోగుల ఇబ్బందులన్నీ పరిష్కరిస్తానని అప్పటికప్పుడు హామీ ఇచ్చారు. ఇంతకు ముందు ఎన్నోసార్లు తమ సమస్యలు విన్నవించేందుకు అపాయింట్ మెంట్ అడిగినా కనికరించని కేసీఆర్.. ఇప్పుడు ఇలా హఠాత్తుగా తమపై ఎందుకు ప్రేమ కురిపిస్తున్నారబ్బా అని టీఎన్జీఓ నేతలు కొంతమంది దీర్ఘాలోచనలో పడ్డారట.

ఐతే అసలు విషయం ఏంటంటే.. ఆర్టీసీ కార్మీకులు అందరి మద్దతు కూడగట్టే సమయంలో.. టీఎన్జీఓ సంఘం వారికి మద్దతు ఇవ్వకుండా చేసే కట్టడిలో భాగంగానే కేసీఆర్ ఇలా వారిని పిలిపించి.. హామీలిచ్చి.. ఆశల పల్లకిలోకి నెట్టారన్న వాదన బలంగా విన్పిస్తోంది. ఇలా ఈ ఒక్క ఉద్యోగ సంఘాన్నే కాదు.. మరో రెండు మూడు ఉద్యోగ సంఘాలతోనే కేసీఆర్ భేటీ కానున్నారని తెలుస్తోంది. ఐనప్పటికీ ఆర్టీసీ జేఏసీ మాత్రం ఎక్కడా ప్రభుత్వానికి భయపడకుండా న్యాయమైన తమ డిమాండ్ల కోసం సమ్మెను ఉధృతం చేస్తోంది. ప్రజలు, ప్రతిపక్షాల మద్దతు ఉన్నంత వరకు విజయం తమదే అని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఆర్టీసీ కార్మికులు.

Leave A Reply

Your email address will not be published.