News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

కేసీఆర్ కు దిమ్మ‌దిరిగి మైండ్ బ్లాంక్ అవ‌డం ఖాయం..

  • కేసీఆర్ .. నీ నియంతృత్వ పాల‌న ఇక చెల్ల‌దు..
  • ప‌ద్మావ‌తి విజ‌యం.. తెలంగాణ‌లో ప్ర‌జాస్వామ్యానికి అవ‌స‌రం.
  • హుజూర్ న‌గ‌ర్ లో కాంగ్రెస్ గెలుపు డిసైడ్ అయిపోయింది..
  • టిఆర్ఎస్ ను ఓడించి..కేసీఆర్ కృర‌త్వానికి బ్రేకులు వేయాలి..కోదండ‌రామ్

హుజూర్ న‌గ‌ర్ లో కాంగ్రెస్ గెలుపు ఖాయమైపోయింద‌ని .. ఆక్టోబ‌ర్ 21 న ప్ర‌జ‌లు ప‌ద్మావ‌తి రెడ్డికి ప‌ట్టంక‌ట్ట‌బోతున్నార‌ని అన్నారు పీసీసీ చీఫ్, న‌ల్గొండ ఎంపీ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి. హుజూర్ న‌గ‌ర్ లో కాంగ్రెస్ గెలుపు .. నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కే కాకుండా.. యావ‌త్తు తెలంగాణ భ‌విష్య‌త్ కు ఎంతో అవ‌స‌ప‌రం అన్నారు. ఎన్నిక‌ల ప్ర‌చారం లో జ‌న‌స‌మితి అద్యక్షులు ప్రోఫెస‌ర్ కోదండ‌రాం, ఎమ్మెల్సీ జీవ‌న్ రెడ్డి, దామోద‌ర్ రెడ్డిల‌తో క‌ల‌సి.. మీడియాతో మాట్లాడిన ఉత్తమ్.. హుజూర్ న‌గ‌ర్ ప్ర‌జ‌లు ఈ ఎన్నిక‌ల్లో ప‌ద్మావ‌తి రెడ్డిని గెలిపించి.. కేసీఆర్ కు దిమ్మ‌తిరిగే జ‌వాబు ఇవ్వ‌బోతున్నార‌ని జోష్యం చెప్పారు.

kodhandaram political comments on cm kcr

కేసీఆర్ డిక్టేట‌ర్ షిప్ పాల‌న తెలంగాణలో ఎక్కువ రోజులు న‌డ‌వ‌ద‌న్న ఉత్త‌మ్ కుమార్ రెడ్డి.. హుజూర్ న‌గ‌ర్ లో .. కేసీఆర్ కు ప్ర‌జ‌లు క‌ర్రు కాల్చి వాత‌పెట్ట‌బోతున్నార‌ని అన్నారు. టిఆర్ఎస్ మంత్రులు ఓట్ల‌కోసం ప్ర‌జ‌ల‌ను ప్ర‌లోభాల‌ను గురిచేస్తున్నార‌ని మండిప‌డ్డ ఉత్త‌మ్.. ఆ మంత్రులకు దైర్గ్యం ఉంటే… ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీలు ఎందుకు నెర‌వేర్చ‌లేదో ప్ర‌జ‌ల‌కు చెప్పాల‌న్నారు. హుజూర్ న‌గ‌ర్ ఫ‌లితం.. రాష్ట్రంలో కేసీఆర్ ఆప్ర‌జాస్వామ్య పాల‌న అంతానికి నాంది ప‌ల‌క‌బోతుంద‌ని అన్నారు ఉత్త‌మ్.

- Advertisement -

టిఆర్ఎస్ అభ్య‌ర్థి సైది రెడ్డికి ఓటేస్తే.. హుజూర్ న‌గ‌ర్ ను మాపీయాకు అడ్డ‌గా మార్చుతార‌న్న ఉత్త‌మ్… ఇప్ప‌డికే సైదిరెడ్డి భూకబ్జాలు, సాండ్ మాఫియా, గుండాగిరి చూస్తున్న ప్ర‌జ‌లు ఈఎన్నిక‌ల్లో త‌ప్ప‌క బుద్ది చెబుతార‌న్నారు. కేసీఆర్ 2014, 2018 ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామిల‌పై టిఆర్ఎస్ నేత‌లు ఎందుకు మాట్లాడ‌టం లేద‌ని ప్ర‌శ్నించిన ఉత్త‌మ్.. ద‌లితుల‌కు మూడెక‌రాలు. ముస్లీంల‌కు 12, రిజ‌ర్వేష‌న్ , నిరుద్యోగ యువ‌త‌కు 3016 నిరుధ్యోగ భృతి ఎందుకు అమ‌లు చేయ‌డంలేద‌ని నిల‌దీశారు ఉత్త‌మ్.

kodhandaram political comments on cm kcr

ఆర్టీసీ కార్మికుల స‌మ్మెను ప‌ట్టించుకోకుండా.. సీఎం కేసీఆర్ కృరంగా వ్య‌వ‌వ‌హ‌రిస్తున్నార‌ని అన్నారు జ‌న‌స‌మితీ అధ్యక్షులు కోదండ‌రామ్. సీఎం అనే గ‌ర్వంతో.. కేసీఆర్ విర్ర‌వీగుతున్నార‌న్న కోదండ‌రామ్.. హుజూర్ న‌గ‌ర్ లో కాంగ్రెస్ గెలుపు.. తెలంగాణ‌లో కేసీఆర్ నీయంతృత్వ నిర్ణ‌యాల‌కు చెక్ పెట్టే తాళం చెవిలాంటి అవుతుంద‌ని అన్నారు. పొర‌పాటున హుజూర్ న‌గ‌ర్ లో టీఆర్ఎస్ గెలిస్తే.. ఇక కేసీఆర్ నీయంతృత్వ పాల‌న ప‌రాకాస్ట‌కు చేరి.. అణిచివేత‌ను రాష్ట్ర ప్ర‌జ‌లు చూడాల్సి వ‌స్తుంద‌న్న కోదండ‌రామ్.. హుజూర్ న‌గ‌ర్ లో కాంగ్రెస్ గెలుపు తెలంగాణ‌లో ప్రజాస్వామ్యానికి నాందికాబోతుంద‌ని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.