News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

ఎల్లుండి పాక్షిక చంద్ర గ్రహణం.. ఈ ఏడాది మరో రెండు

ఈ నెల 10న రాత్రి 10:30 గంటలకు ప్రారంభం కానున్న గ్రహణం
ప్రపంచవ్యాప్తంగా కనువిందు చేయనున్న గ్రహణం
జూన్‌లో రెండు గ్రహణాలు
గత నెల 26న సూర్యగ్రహణం సంభవించగా ప్రపంచం మొత్తం ఆసక్తిగా తిలకించింది. కాగా, ఈ నెల 10న చంద్రగ్రహణం ఏర్పడనుంది. పాక్షిక గ్రహణమైన ఇది ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని ఖండాల్లోనూ కనిపించనున్నట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. ఆ రోజున రాత్రి 10:30 నుంచి 11న తెల్లవారుజామున 2:30 గంటల వరకు గ్రహణం కొనసాగనుంది. ఈ ఏడాది మరో రెండు గ్రహణాలు సంభవించనున్నాయి. జూన్ 5న సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుండగా, అదే నెల 21న సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడనున్నట్టు ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు.
Tags: Lunar Eclipse, Solar Eclipse, India

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.