News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

మహర్షి’ ట్రైలర్ విడుదల

‘అమ్మాయి కాఫీకి పిలిచిందని..లైఫ్ రిస్క్ చేయలేం కదా?’ ఇది  హీరోయిన్ పూజా హెగ్డె పిలుపుకు హీరో మహేష్ బాబు ఇఛ్చిన సమాధానం. మహేష్ బాబు హీరోగా నటించిన సినిమా ‘మహర్షి’ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ను బుధవారం సాయంత్రం విడుదల  చేశారు. హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్డులో అట్టహాసంగా ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ట్రైలర్ ను సీనియర్ హీరో వెంకటేష్ విడుదల చేశారు. ‘మనం గతంలో ఎక్కడ ఉన్నాం. ఇప్పుడు ఎక్కడ ఉన్నాం. అదే తెలుపుతుంది మనం సక్సెస్ అయ్యామా.. లేదా అన్న సంగతి అంటూ మహేష్ బాబు ఓ ఇంటర్వూలో వెల్లడించే సన్నివేశం కూడా ఈ ట్రైలర్ లో ఉంది.

‘బ్యాగులతో ఎంట్రీ ఇఛ్చిన అల్లరి నరేష్ బరువుగా ఉంది బాస్…ఎవరైనా కొంచెం హెల్ప్ చేస్తారా? అంటూ సాయం కోరితే..వచ్చిందే లేట్..అందులో హెల్ప్. ఇక్కడ ఎవరి బరువు వాళ్లు మోసుకోవాల్సిందే. దొబ్బెయ్ అంటూ మహేష్ బాబు సీరియస్ గా వార్నింగ్  ఇస్తారు. ‘ఓడిపోతామనే భయంతో ఆటలో దిగితే ఎప్పటికీ గెలవలేం’. జీవితంలో గెలవటం అంటే డబ్బులు సంపాదించటమేనా?. వంటి పవర్ ఫుల్ డైలాగ్ లు ఎన్నో ఈ ట్రైలర్ లో ఉన్నాయి. అత్యంత ప్రతిష్టాత్మకంగా మహేష్ బాబు 25వ సినిమాగా తెరకెక్కిన మహర్షి ఈ నెల9న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.