News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

మహేష్ వ్యక్తిత్వంలో మార్పు లేదు

మహేష్ బాబు, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా సరిలేరు నీకెవ్వరు. ఈ సినిమాలో ప్రముఖ పొలిటీషియన్, సీనియర్ నచి విజయశాంతి కీలక పాత్ర పోషిస్తోంది. ఇటీవలే విజయశాంతి ఈ చిత్ర షూటింగ్‌లో జాయిన్ అయ్యింది. ఈ నేపధ్యంలో మహేష్ బాబు ట్విట్టర్ వేదికగా నటి విజయశాంతిపై ఓ ట్వీట్ చేశారు. 30 సంవత్సరాల క్రితం వచ్చిన కొడుకు దిద్దిన కాపురం సినిమాలోని ఫొటోని పోస్ట్ చేశాడు. ఇక్కడే మా ప్రయాణం మొదలైంది.. 1989లో కొడుకు దిద్దిన కాపురం మూవీ సెట్స్‌లో.. 30 సంవత్సరాల తర్వాత నేను మళ్లీ సరిలేరు నీకెవ్వరు చిత్రంలో విజయశాంతిగారితో కలిసి నటిస్తున్నాను. జీవితం అనేది నిజంగా చక్రం వంటిది.. అని ట్వీట్ చేశారు మహేష్ బాబు.

vijayashanti
ఇక మహేష్ బాబు ట్విట్ పై విజయశాంతి స్పందించారు. కాలగమనంలో ప్రకృతి మార్పును తీసుకొస్తుంది.. అయితే మహేష్ బాబుగారి వ్యక్తిత్వంలో మాత్రం ఎటువంటి మార్పు లేదు.. ఆయన మనసే ఆయనకు గొప్ప అభరణం.. 1989లో మా కాంబినేషన్ మొదలవ్వడానికి ముందు.. ఇదే రోజు 1980‌లో కిలాడీ కృష్ణుడు చిత్రంలో సూపర్ స్టార్ కృష్ణగారితో జంటగా నా సినీ ప్రయాణం మొదలైంది. కళ అనేది అనంతం.. అది మీలాంటి వారి వల్ల భ్రమణం చేస్తుంది.. వారసత్వం ఒక విలువైన సంపద.. అని విజయశాంతి మహేష్ బాబును పొగడ్తలతో ముంచెత్తింది.

- Advertisement -

Tags: mahesh babu, vijayashanti, sarileru neekevvaru, mahesh babu about vijayashanti, vijayashanti about mahesh bau, sarileru neekevvaru movie

 

Leave A Reply

Your email address will not be published.