News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

కాళేశ్వరం ద్వారా ఒక్క ఎకరాకన్నా నీళ్లు ఇచ్చావా ..!

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ లాంటి పెద్ద గజదొంగ ఇంకొకరు లేరని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తీవ్ర ఆరోపణలు చేశారు. గాంధీ భవన్ ప్రాంగణంలోని ఇందిరా భవన్ లో జరిగిన యువజన కాంగ్రెస్ సమావేశంలో పాల్గొన్న ఆయన ముఖ్యమంత్రిపై తీవ్ర ఆరోపణలతో విరుచుకుపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి అయిందని చెబుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ ప్రాజెక్టు నుంచి ఒక్క ఎకరాకు అయినా నీళ్లు ఇచ్చారా? అని తీవ్ర స్వరంతో ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చెబుతున్న కాళేశ్వరం ఒక పెద్ద మోసం.. మహా అబద్దం అని భట్టి విక్రమార్క చెప్పారు. కేసీఆర్ ఒక మాయల మరాఠీ అని భట్టి అన్నారు. ముఖ్యమంత్రి చెబుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు మెడిగడ్డ, సుందిళ్ళ, అన్నారం, శ్రీపాద ఎల్లంపల్లి, అక్కడనుంచి మెదక్ జిల్లాలో ప్రాజెక్టులు, చివరగా ఎస్సారెస్పీ కి నీళ్లు పారితేనే కాళేశ్వరం పూర్తి అయినట్లు అవుతుందని అన్నారు. కానీ ఇప్ప‌టివ‌ర‌కూ మేడిగ‌డ్డ‌, అన్నారం, సుందిళ్ల బారేజ్ లు మాత్ర‌మే పూర్తి అయ్యాయి. వాటికే దాదాపు 80 వేల కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు పెట్టారు. ఇంకా ఒక్క ఎక‌రాకు కూడా నీళ్లు పార‌లేదు. కేసీఆర్ చెబుతున్న ప్ర‌కారం ప్రాజెక్టు పూర్తి కావాలంటే క‌నీసం 4 నుంచి 5 ల‌క్ష‌ల కోట్ల రూపాయాలు అవ‌స‌రం అవుతాయ‌ని భ‌ట్టి చెప్పారు.

Bhatti

కాళేశ్వ‌రం ప్రాజెక్టుకు తెచ్చిన అప్పుల‌న్నీ క‌మ‌ర్షియ‌ల్ బ్యాంక్ ల నుంచి తెచ్చిన‌వేన‌ని.. ఆ బ్యాంకులు దాదాపు 11 ప‌ర్సెంట్ వ‌డ్డీ తీసుకుంటాయ‌ని తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్త‌య్యే నాటికి ల‌క్ష కోట్లు తెస్తే.. రెండేళ్ల‌కే అది రెండు ల‌క్ష‌ల కోట్ల‌కు చేరుతుంద‌ని.. అదే 4 నుంచి 5 ల‌క్ష‌ల కోట్లు అప్పు తెస్తే అదే దాదాపు వ‌డ్డీతో క‌లిపి ప‌ది లక్ష‌ల కోట్ల‌కు చేరుతుంద‌ని భ‌ట్టి వివ‌రించారు. ఈ అప్పంతా తెలంగాణ స‌మాజం మీద ప‌డుతుంద‌ని భ‌ట్టి విక్ర‌మార్క వివ‌రించారు. గ‌తంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వాలు ప్రాజెక్టులను ఖ‌జానా నుంచి నిర్మించేవ‌ని.. అప్పు త‌ప్ప‌నిస‌రి అయితే వ‌ర‌ల్డ్ బ్యాంక్ లేదా ఐఎంఎఫ్ ఇత‌ర అంత‌ర్జాతీయ బ్యాంకుల నుంచి తెచ్చేవ‌ని చెప్పారు.

- Advertisement -

Bhatti

Tags: MALLU BHATTI VIKRAMARKA,KCR,KTR, KALESHWARAM PROJECT,CBI, ENQUIRY, REVANTH REDDY,UTTAM KUMAR REDDY, POWER’PROJECTS, GANDHIBHAVAN,TRS BHAVAN, TELANGANA GOVERNMENT

Leave A Reply

Your email address will not be published.