సీతక్క .. కాంగ్రెస్ ఎమ్మెల్యే. పక్కా మాస్ లీడర్. ఆమే జనంలోకి వెళితే ఇట్టే కలిసి పోవడం ఆమె నైజం. ఎక్కడా హంగు ఆర్భాటాలకు పోకుండా.. సాదా సీదా ఉంటుంది సీతక్క. అయితే ఈ మధ్య సీతక్క సామాజిక , సాంస్కృతిక కార్యక్రమాల్లో తెగ సందడి చేస్తు వార్తల్లో నిలుస్తున్నారు. మొన్న గిరిజనుల తీజ్ ఉత్సవాల్లో .. గిరిజనులతో కలిసి.. డ్యాన్స్ చేసిన సీతక్క.. ఇప్పుడు ఏకంగా కబాడ్డినే ఆడారు. అదేంటీ అనుకుంటున్నారా..? అవును నిజం.. తాను ఎమ్మెల్యేను అన్న విషయాన్నిపక్కన పెట్టి.. విధ్యార్థులతో సీతక్క కబడ్డి ఆడి వారిని సంతోష పెట్టారు. ఇలా సీతక్క కబడ్డి తో చేసిన సందడి ఇప్పుడు సోషల్ మిడియాలో వైరల్ గా మారింది. ములుగు మండలం జాకారంలోని బాలికల మినీ గురుకుల పాఠశాలలో శుక్రవారం ‘ఎంటర్టైన్మెంట్ డే’ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే సీతక్క., విద్యార్థులతో కలిసి సరదాగా కబడ్డీ ఆడి వారిలో ఉత్సాహాన్ని నింపారు. విధ్యార్థులు పట్టుదలతో ఉన్నత చదువులు చదవాలని అంతేకాదు.. చదువుతో పాటు ఆటల్లో కూడా రాణించాలని ఈ సందర్బంగా సీతక్క అన్నారు.మొత్తానికి ఎమ్మెల్యేగా ఉండి సీతక్క తమతో కబడ్డీ ఆడటంతో.. విధ్యార్థులు మురిసిపోయారు.