News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

నాగార్జున పొలంలో అస్థిపంజరం

సినీ నటుడు అక్కినేని నాగార్జున ఫాంహౌజ్ లో శవం కలకలం రేపుతోంది. రంగారెడ్డి జిల్లా కేశంపేట్ మండలం పాపిరెడ్డిగూడ గ్రామంలో నాగార్జునకు 40 ఎకరాల ఫాంహౌజ్ ఉంది. అనుకోకుండా రెండు రోజుల క్రితం ఫాంహౌజ్ లోని ఓ రూంలో దాదాపు అస్తిపంజరంగా మారిన ఓ శవం బయటపడింది. దీంతో ఒక్కసారిగా స్థానికంగా కలకలం రేగింది. వారం రోజుల ముందు నాగార్జున సతీమణి అక్కినేని అమల అధికారులతో కలిసి హరితహారంలో పాల్గొంది. అయినప్పటికీ వాళ్లెవరూ ఈ శవాన్ని గుర్తించలేకపోయారు. ఇక రెండు రోజుల పోలీస్ విచారణ చరువాత నాగార్జున ఫాంహౌజ్ లో కనిపించిన శవం ఎవరిదో కనిపెట్టారు. సుమారు నాలుగేళ్ల క్రితం కనిపించకుండా పోయిన అదే గ్రామం పాపిరెడ్డిగూడకు చెందిన పాండు (32)దే ఆ శవం అని పోలీసులు తేల్చారు. నాగార్జున ఫాంహౌజ్ లో విష గుళికలు మింగి  అతను ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. పాపిరెడ్డి గూజ గ్రామానికి చెందిన చిన్న అంజయ్య-జంగమ్మ దంపతుల నలుగురు సంతానంలో పాండు ఆఖరివాడు. అతనికి తన మూడో అన్న కుమార్‌ అంటే ప్రాణం. ఐతే కుమార్‌ అనారోగ్యంతో మృతిచెందడం పాండును తీవ్రంగా కలిచివేసింది. ఆ రోజు నుంచి పాండు బాగా కుంగిపోయాడు. తనకు కూడా బతుకు మీద ఆశ చచ్చిపోయిందని అందరితో చెప్పేవాడు.

nagarjuna farm house

- Advertisement -

ఈ క్రమంలో ఓ రోజు  కుటుంబ సభ్యులకు లెటర్ రాసి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. పాండు కోసం కుటుంబసభ్యులు అంతా వెతికినా అతని జాడ మాత్రం తెలియలేదు. పాండు అదృశ్యంపై ఎవ్వరూ పోలీసులకు ఫిర్యాదు కూడా చేయలేదు.  అదే గ్రామంలోని పొలంలో చాలా కాలం నుంచి పనులేవీ జరగడం లేదు. రెండు రోజుల క్రితం అక్కినేని నాగార్జున సేంద్రియ పద్ధతిలో సాగు పనులు చేపట్టేందుకు కొందరిని ఇక్కడికి పంపించాడు. బుధవారం సాయంత్రం అక్కడికి వచ్చిన వాళ్లు స్థానికుడైన బుద్దోలు శ్రీశైలంతో కలిసి ఫాంహౌజ్ లో ఉన్న షెడ్డులోకి వెళ్లి చూడగా అస్థిపంజరం కనిపించింది. మృతదేహంపై కేవలం బట్టలు మాత్రమే మిగిలాయి. దీంతో పోలీసులకు సమాచారం ఇవ్వగా వాళ్లు రంగప్రవేశం చేసి విచారణ చేపట్టారు. జేబులో ఆధార్‌ కార్డు ఆధారంగా మృతుడిని పాండుగా గుర్తించారు. 2106లో పాండు ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు.

Tags: nagarjuna farm house, dead body in nagarjuna farm house, dead body find out in nagarjuna farm house, human skelleten in nagarjuna farm house

Leave A Reply

Your email address will not be published.