News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

యాదాద్రిలో కేసీఆర్ బొమ్మలు సరికాదు

ముఖ్యమంత్రి కేసీఆర్ పై మాజీ హోంమంత్రి, టీఆర్ ఎస్ సీనియర్ నాయకుడు నాయిని నర్సింహా రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు మంత్రి పదవి ఇస్తానని చెప్పిన కేసీఆర్‌ మాట తప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని అడిగితే.. మరోసారి ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి ఇస్తానని మాట ఇచ్చారని నాయిని గుర్తు చేశారు. అంతే కాదు తన అల్లుడు, కార్పొరేటర్‌ శ్రీనివాస్ రెడ్డికి కూడా ఎమ్మెల్సీ పదవి ఇస్తానని కేసీఆర్‌ హామీ ఇచ్చారని చెప్పారు. ఐతే సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయారని వాపోయారు. అసెంబ్లీ లాబీలో నాయిని నర్సింహా రెడ్డి మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఇక తనకు ఆర్టీసీ కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి ఇవ్వబోతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై తనదైన స్టైల్లో స్పందించారాయన.

nayini
హోంమంత్రిగా పనిచేసిన తనకు.. కార్పొరేషన్‌ పదవి ఎందుకని ప్రశ్నించారు. ఏ కార్పొరేషన్‌ పదవి ఇచ్చినా తీసుకోనని తేల్చి చెప్పిన నాయిని.. కేసీఆర్ పిలిచినప్పుడు ఇదే అభిప్రాయాన్ని చెబుతానని స్పష్టం చేశారు. అంతే కాదు మండలి చైర్మన్‌ పదవి ఇస్తానని కేసీఆర్‌ చెప్పినా తనకు వద్దని తిరస్కరించినట్లు తెలిపారు.  ఇక గత కొంత కాలంగా పార్టీలో వివాదమవుతున్న టీఆర్‌ఎస్ ఓనర్ల అంశంపైనా నాయిని నర్సింహా రెడ్డి స్పందించారు. టీఆర్‌ఎస్ లో ఉన్నోళ్లంతా పార్టీ ఓనర్లేనన్న ఆయన.. తెలంగాణ ఉద్యమంలో తాను మొదటోడినని, ఇప్పుడైతే కుటుంబానికి పెద్ద కేసీఆరే అని వ్యాఖ్యానించారు. తామంతా ఇంటి ఓనర్లమే అని, కిరాయిదార్లు ఎంతకాలం అందులో ఉంటారనేది వాళ్ల ఇష్టమని అన్నారు. ఇక జీహెచ్‌ఎంసీ పరిధిలో అభివృద్ది పనులు జరగకపోవడం వల్ల పార్టీకి కొంత ఇబ్బందికరంగానే ఉందన్నారు నాయిని నర్సింహా రెడ్డి. యాదాద్రిలో సీఎం కేసీఆర్ చిత్రాలు చెక్కడం సరికాదని వ్యాఖ్యానించారు.

- Advertisement -

Tags: nayini, nayini narsimha reddy, natini fire on cm kcr, nayini narsimha reddy fire on cm kcr, nayini narsimha reddy contravercy comments on cm kcr, ex home minister nayini fire on cm kcr

Leave A Reply

Your email address will not be published.