News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

‘దాల్ లేక్’లో 16 కొత్త వ్యూ పాయింట్స్

దాల్ లేక్. పర్యాటకులకు అది ఓ అద్భుతమైన ప్రాంతం. జమ్మూ కాశ్మీర్ సందర్శనకు వెళ్ళిన వారు ఎవరైనా ఈ ప్రాంతాన్ని చూడకుండా వెనక్కి రారు. అంతటి ప్రాముఖ్యత ఉంటుంది ఈ ప్రాంతానికి. పర్యాటకుల సౌకర్యార్ధం జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం కొత్తగా దాల్ లేక్ లో 16 వ్యూ ఫాయింట్స్ ఏర్పాటు చేయనుంది. పర్యాటకుల సౌకర్యార్ధం…మరిన్ని మెరుగైన సౌకర్యాలతో ఈ పాయింట్స్ ఏర్పాటు చేయనున్నారు. వీటిని ఘాట్స్ గా సర్కారు చెబుతోంది.

- Advertisement -

అత్యాధునిక, సంప్రదాయ పద్దతులతో ఈ వ్యూ పాయింట్స్ ను డెవలప్ చేయనున్నారు. ఈ విషయాన్ని కాశ్మీర్ టూరిజం డైరక్టర్ ఎన్ ఏ వాణి తెలిపారు. ఈ వ్యూ పాయింట్స్ రాబోయే రోజుల్లో పర్యాటకులను మరింత ఆకట్టుకోవటానికి ఉపయోగపడతాయని భావిస్తున్నారు. దాల్ లేక్ లో భారతీయ సినీ పరిశ్రమకు చెందిన పలు భాషలు చిత్రాలు అక్కడ షూటింగ్  చేసుకునే విషయం తెలిసిందే.

Leave A Reply

Your email address will not be published.