News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

నిత్యానంద సొంత దేశపు రూల్స్ ఇవే…పాస్ పోర్ట్ సపరేట్

అత్యాచారం ఆరోప‌ణ‌ల‌తో దేశం విడిచి పారిపోయిన వివాదాస్ప‌ద నిత్యానంద…దేశంలోని కోర్టుల తీర్పులు, ఆరోప‌ణ‌ల‌తో…ఆందోళ‌న‌లో ఉన్నాడేమో అని అంతా చ‌ర్చించుకుంటుండ‌గా…దానికి భిన్నంగా ఆనందంగా జీవితం గడుపుతున్న‌ట్లు తేలింది. తనపై నమోదైన లైంగికదాడి కేసును తప్పించుకొనేందుకు పాస్‌పోర్టు లేకుండా దేశం వదిలి పారిపోయిన నిత్యానంద సెంట్రల్‌ అమెరికాలో ఈక్వెడార్‌కు సమీపంలో ఒక రాజ్యాన్ని స్థాపించినట్టు ప్రకటించాడు.

దాని పేరు కైలాస అని, తమకు ప్రత్యేక పాస్‌పోర్టు ఉందని తెలిపాడు. కొత్త దేశం పేరిట వెబ్‌సైట్‌ కూడా ప్రారంభించిన నిత్యానంద తమది ఈ ప్రపంచంలోనే గొప్ప హిందూ దేశం అని చెప్పుకున్నాడు. తమది సరిహద్దులు లేని దేశమని, తమ తమ దేశాల్లో స్వేచ్ఛగా హిందూయిజాన్ని అనుసరించలేని వారి కోసం ఈ దేశం ఏర్పాటయిందని కైలాస వెబ్‌ సైట్లో పేర్కొన్నారు.

- Advertisement -

అహ్మదాబాద్‌లోని ఆశ్రమంలో బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని నిత్యానంద‌పై ఆరోపణలు రావడంతోపాటు, మరో సెక్స్‌ కుంభకోణం కూడా గత నెలలో బట్టబయలైంది. దీంతో అతడు దేశం వదిలి పారిపోయినట్టు పోలీసులు అనుమానిస్తున్న త‌రుణంలోనే…ఆ అనుమానం నిజం చేస్తూ…ఈక్వెడార్‌ నుంచి ఒక చిన్న ద్వీపాన్ని కొనుగోలు చేసి, దానికి ‘కైలాస’ అనే పేరు కూడా పెట్టుకొని సొంత దేశంలో జీవితాన్ని గ‌డిపేస్తున్నాడని స్ప‌ష్టమైంది. కైలాస రాజకీయేతర హిందూ దేశమని, హిందూత్వ పునరుద్ధరణ కోసం కృషి చేస్తుందని ఆ వెబ్‌సైట్లో పేర్కొన్నారు. గోల్డ్, రెడ్‌ కలర్లలో పాస్‌పోర్ట్‌ను రూపొందించారని ఆ ‘దేశ’ వెబ్‌సైట్‌ పేర్కొంది. మెరూన్‌ కలర్‌ బ్యాక్‌గ్రౌండ్‌లో ఓ సింహాసనం ముందు నిత్యానంద కూర్చుని ఉండగా పక్కన నంది ఉన్న చిత్రంతో జెండాను రూపొందించారు.

ఒక ప్రభుత్వాన్ని, ప్రధాన మంత్రిని, కేబినెట్‌ను కూడా ఏర్పాటు చేశారు. ప్రధానిగా ‘మా’ని నియమించారని, రోజూ కేబినెట్‌ భేటీలు కూడా జరుపుతున్నారని సమాచారం. తన ‘కైలాస’కు ఒక దేశంగా గుర్తింపునివ్వాలని కూడా నిత్యానంద ఐక్యరాజ్య సమితికి విజ్ఞప్తి చేయనున్నారు. హిందూత్వని ప్రచారం చేస్తున్నందువల్ల భారత్‌లో తన జీవితం ప్రమాదంలో పడిందని ఐరాసకు పంపనున్న వినతి పత్రంలో నిత్యానంద పేర్కొన్నారు. తనదేశంలో పౌరసత్వం పొందాలని ఆహ్వానం పలుకుతున్న నిత్యానంద అదే సమయంలో పరిపాలన సాగించేందుకు విరాళాలు కూడా ఇవ్వాలని కోరుతున్నాడు.

80%
Awesome
  • Design

Leave A Reply

Your email address will not be published.