
హుజూర్ నగర్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పద్మావతి ఉత్తమ్ కుమార్ రెడ్డి పోటీ చేయనుంది. ఈమేరకు పీసిసి చీఫ్, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పద్మావతి పేరును ప్రకటించారు. గతంలో కోదాడ ఎమ్మెల్యేగా పనిచేసిన పద్మావతి.. గత ఎన్నికల్లో కోదాడ నుంచి పోటీ చేసి స్వల్ప మెజార్టీతో ఓడిపోయారు. హుజూర్ నగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఉత్తమ్ కుమార్ రెడ్డ.. ఆ తరువాత నల్గొండ ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. అందుకని ఎమ్మెల్యే పదవికి ఉత్తమ్ రాజీనామా చేయడంతో హుజూర్ నగర్ కు ఉప ఎన్నిక అనివార్యమైంది. పద్మావతిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు.
సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం నక్కగూడెంలో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అన్ని విధాలా అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. అధికార టీఆర్ ఎస్ పార్టీ బెదిరింపులకు భయపడేది లేదన్న ఉత్తమ్.. హుజూర్ నగర్ ను కష్టపడి అభివృద్ది చేసింది తానేనని చెప్పారు. మునుముందు కూడా ఈ ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ది చేస్తానని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.
Tags: padmavati, padmavati uttam, padmavati uttam contasting from huzurnagar, padmavati uttam contasting from huzurnagar bypoll, huzurnagar bypoll congress mla candidate padmavati uttam