News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

రోడ్డెక్కనున్న పవన్ కళ్యాణ్

పవర్ స్టార్ పాదయాత్ర… జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాదయాత్ర కు సిద్ధమయ్యారు. ఏపీలో సీఎం జగన్ తీసుకువచ్చిన కొత్త ఇసుక పాలసీతో రోడ్డున పడ్డ భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా తొలిసారి రోడ్డెక్కబోతున్నారు జనసేనాని. కొత్త సాండ్ పాలసీతో ఉపాధి కోల్పోయిన 35 లక్షలమంది కోసం నవంబర్ 3 లేదా 4 వ తేదీల్లో విశాఖలో భారీ పాదయాత్ర చేయనున్నారు పవణ్ కళ్యాణ్. ఎన్నికల్లో ఓటమి తర్వాత హైదరాబాద్ తొలిసారి జరిగిన జనసేన పార్టీ పొలిట్ బ్యూరో మరియు పీఏసీ కమిటీల భేటీలో .. ఏపీ ,తెలంగాణ ప్రభుత్వాల తీరుతెన్నులపై చర్చించారు.

- Advertisement -

జగన్ ప్రభుత్వం సీపీఎస్ విధానం రద్దు చేస్తామన్న ఎన్నికల హామీని విస్మరించిందని ., జనసేన కార్యకర్తలపై రాజకీయ కక్షలతో అక్రమ కేసులు నమోదు అభిప్రాయ పడింది. తాగుడు పెంచేలా జగన్ ప్రభుత్వ మద్యం విధానం ఉందన్న పవన్ .. అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల తొలగింపు నిర్ణయం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.