News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

రన్ వే నుంచి…నదిలోకి విమానం

ల్యాండ్ అయి రన్ వేపై ఆగాల్సిన విమానం నదిలోకి వెళ్ళింది. అంతే ఒక్కసారిగా కలకలం. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. సంఘటన చోటుచేసుకున్న వెంటనే అగ్నిమాపక, రక్షణ  దళాలు రంగ ప్రవేశం చేసి  ప్రయాణికులను అందరినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటన ఫ్లోరిడాలోని జాక్సన్ విల్లే విమానాశ్రయంలో చోటుచేసుకుంది.

- Advertisement -

క్యూబా నుంచి వచ్చిన బోయింగ్ 737 విమానం ల్యాండ్ అయిన తర్వాత రన్ వే మీద నుంచి జారుకుంటూ నదిలోకి వెళ్ళింది. ఆ సమయంలో విమానంలో  మొత్తం 143 మంది ఉన్నారు. ఈ ఘటనతో విమానంలోని కొంత మందికి గాయాలు అయ్యాయని జాక్సన్ విల్లే మేయర్ తెలిపారు. విమాన ఇంథనం ఏవియేషన్ టర్భైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) నదిలోని నీటితో కలవకుండా ఉండేందుకు చర్యలు ప్రారంభించారు. ఈ ఫ్యూయల్ కు మండే స్వభాగం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.

 

Leave A Reply

Your email address will not be published.