బీసీల‌ను అన్యాయం జ‌రిగితే కాంగ్రెస్ ఊర్కోదు..

news02 July 12, 2018, 11:29 a.m. political

uttam kumara reddy , pcc chief, tpcc, bc reservastions

హైద‌రాబాద్ : పంచాయితీ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుందన్న సీఎం వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిప‌డుతంది. అస‌లు కేసీఆర్ కు పంచాయితీ ఎన్నికలు పెట్టాలనే ఉద్దేశ్య‌మే లేద‌ని అంటుంది. నిజంగా బిసీల ప‌ట్ల కేసీఆర్ కు చిత్త శుద్ది ఉంటే.. పంచాయీతి రాజ్ బిల్లులో ఇన్ని లోపాలు, లొసుగులు ఎందుకు పెట్టారో సిఎం చెప్పాల‌ని డిమాండ్ పీసీసీ ఛీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. కేసీఆర్ బోగ‌స్ త‌న మాట‌ల‌తో మ‌రోసారి బీసీల‌ను మోసం చేయాల‌ని చూస్తున్నార‌ని విమ‌ర్శిస్తున్నారు ఉత్త‌మ్. బిసీల‌పై క‌ప‌ట ప్రేమ కురిపిస్తున్న కేసీఆర్.. బీసీ రిజ‌ర్వేష‌న్ల పై చ‌ర్చించేందుకు ఎందుకు అఖిల‌ప‌క్ష స‌మావేశాన్నిఏర్పాటు చేయ‌లేద‌ని ప్ర‌శ్నించారు.అమేరికా ప‌ర్య‌ట‌న‌ను ముగించుకుని వ‌చ్చిన త‌ర్వాత గాంధిభ‌వ‌న్ లో మీడియా చిట్ ఛాట్ లో మాట్లాడారు ఉత్త‌మ్.

/shabbir_ali_and_ponguleti sudhakar reddy

స‌ర్చంచ్ ఎన్నిక‌ల‌ను అడ్డుకుంటుంద‌ని కేసీఆర్ అన‌డం సిగ్గు చేట‌ని అన్నారు  మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ. అడ్డుగోలు విధానంతో పంచాయితీ రాజ్ బిల్లును తెచ్చిన కేసీఆర్ .. బిల్లులోని లోసుల‌గుల‌పై ఎందుకు మాట్లాడ‌టం లేద‌ని ప్ర‌శ్నించారు. ప్ర‌భుత్వం తీరుపై కోర్ట్ ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినా కేసీఆర్ సర్కార్ కు సిగ్గురావడం లేద‌ని అన్నారు. నాడు కాంగ్రెస్ సర్కారు 2013 లో బీసీలకు యాబై శాతం నిబంధనను పక్కన పెట్టి .. 60 శాతానికి పైగా రిజర్వేషన్స్ అమలు చేసేందుకు కోర్ట్ ను ఒప్పించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు . ఇంత పెద్ద ఇష్యు పై కోర్టు లో వాదనలు జరుగుతుంటే .. ఎందుకు అద్వకేట్ జనరల్ హాజరు కాలేదో కేసీఆర్  సమాధానం చెప్పాల‌న్నారు. ప్ర‌చారం ఆర్బాటం చేయ‌డం.. తర్వాత వ్యవహారాన్ని గాలికి వదిలేయ‌డం కేసీఆర్ కు అలావాటుగా మారింద‌న్నారు పొంగులేటీ సుధాక‌ర్ రెడ్డి. బీసీల‌కు కేసీఆర్ అన్యాయం చేస్తుంటే కాంగ్రెస్ చూస్తూ ఊర్కోద‌ని అన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని .. కేసీఆర్ స్వామ్యమే ఉందని ఆయ‌న విమర్శించారు 

tags: uttam kumareddy, shabbir ali, ponguleti sudhakar reddy, bc resevravstions, panchayathraj act, surapnch elections

Related Post