టీఆర్ ఎస్ నేతలను తరిమికొడుతున్న ప్రజలు

news02 Oct. 9, 2018, 9:09 a.m. political

trs

ముందస్తుకు ఎన్నికలకు వెళ్లి మళ్లీ అధికారంలోకి రావాలని కలలు కంటున్న టీఆర్ ఎస్ పార్టీకి నిరసనల మీద నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే టీఆర్ ఎస్ పార్టీ నేతలు ఎక్కడికి వెళ్లినా జనం నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఈ నాలుగున్నరేళ్లలో కేసీఆర్ ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకపోవడంతో ప్రజలు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ ఏ మొహం పెట్టుకుని తమ తమ గ్రామాల్లోకి వచ్చారంటూ ఫైర్ అవుతున్నారు. కొన్ని గ్రామాల్లో ఐతే తాజా మాజీ టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలను తరిమికొడుతున్నారు. దీంతో టీఆర్ ఎస్ నేతలు ప్రచారానికి వెళ్లాలంటేనే జంకుతున్నారు. ఖానాపూర్‌ మాజీ ఎమ్మెల్యే, టీఆర్ ఎస్ అభ్యర్థి రేఖానాయక్‌ కు చేదు అనుభవం ఎదురైంది. మంచిర్యాల జిల్లా చెన్నారం మండలంలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన రేఖా నాయక్ ను ప్రజలు అడ్డుకున్నారు. 

trs

ఎన్నికల ప్రచారంలో భాగంగా బాదంపల్లికి వెళ్లిన రేఖానాయక్‌ను జనం నిలదీశారు. గత నాలుగున్నరేళ్లలో ఒక్కసారైనా తమ గ్రామానికి రాని వారు ఇప్పుడెందుకు వచ్చారంటూ గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. అక్కడికి చేరుకున్న కొందరు టీఆర్ ఎస్ కార్యకర్తలు సైతం ఆందోళనకారులతో గొంతు కలిపారు. తమ ఊరికి ప్రచారానికి వస్తున్నట్టు తమకు కూడా కనీసం సమాచారం ఇవ్వరా అంటూ.. టీఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్ధి రేఖా నాయక్ పై ఫైర్ అయ్యారు. ఆమె ఎన్నికలప్రచార రథాన్ని ముందుకు పోనివ్వకుండా గ్రామస్తులు, టీఆర్ ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో అసహనానికి గురైన రేఖానాయక్‌ టీఆర్ ఎస్ పార్టీ ఎవరికీ భయపడదంటూనే.. ఇప్పటి వరకు టీఆర్ ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్దిని వివరించే ప్రయత్నం చేసింది. ఐనప్పటికీ జనం ఆందోళన విరమించకపోవడంతో.. పోలీసులు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.

tags: villagers fire on trs leaders, telangana people fire on trs leaders, people fire on rekha naik, villagers fire on rekha naik, telangana people fire on kcr, telangana people against trs

Related Post