మ‌ల్కాజ్ గిరి నుంచి పోటీకి సిద్దం ..!

news02 March 13, 2019, 9:21 p.m. political

REVANTH REDDY

హైదరాబాద్ : అధిష్ఠానం ఆదేశిస్తే లోక్‌సభ ఎన్నికల్లో ఎక్కడి నుంచైనా తాను పోటీ చేస్తానని కాంగ్రెస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి స్పష్టంచేశారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు నాయకుడిగా అధిష్ఠానం ఆదేశించినట్లు నడుచుకోక తప్పదన్నారు. ఎన్నికల్లో గెలిచినా ఓడినా కూడా పార్టీ కార్యకర్తలు .. శ్రేణుల్లో.. ధైర్యం .. ఆత్మస్థైర్యం నింపాల్సిన అవసరం ముఖ్యనేతలకు ఉందని చెప్పారు. సీఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు.

REVANTH REDDY

ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు వార్ జోన్ లో ఉన్నాయని అభిప్రాయపడ్డారు రేవంత్ . పోరాడే సమయంలో నాయకుడు పోరాడాల్సిందేనని .. ఇది తన బాధ్యత అనుకుంటున్నానని తెలిపారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో అధిక మెజారిటీతో గెలిచిన బీజేపీ .. మూడు నెల‌ల త‌రువాత వచ్చిన శాసనసభ ఎన్నికల్లో డిల్ల్లీలో ఎందుకు ఓడిపోయిందని రేవంత్‌ ప్రశ్నించారు. కేసీఆర్ గచ్చిబౌలి దివాకర్ అయితే .. కాంగ్రెస్ టెండూల్కర్‌ లాంటిదని వ్యాఖ్యానించారు. సంప్రదాయాల పేరిట టీఆర్ఎస్ .. కాంగ్రెస్ మద్దతు తీసుకుంటుందని .. మరి కాంగ్రెస్‌కు నంబర్ ఉన్నా.. కేసీఆర్ ఎలా అభ్యర్థిని పెట్టారని ఎమ్మెల్సీ ఎన్నికలను ఉద్దేశించి సూటిగా ప్రశ్నించారు.

REVANTH REDDY

tags: REVANTH REDDY CONTESTING AS A MP,REVANTH REDDY,KODANGAL MLA REVANTH REDDY,CONGRESS MPS,TRS MPS,KCR,KTR,HARISH RAO,KAVITHA,RAHUL GANDHI,NARENDRA MODI,TRS,CONGRESS,BJP,YCR,JANASENA

Related Post