నీ భవిష్యత్ ఇదే అని చూపించారా..?

news02 Feb. 26, 2019, 9:11 p.m. political

​​​​​​Harish Rao in trouble in trs

హైదరాబాద్ : టీఆర్ఎస్ లో ఏదో జరుగుతోంది. ఏం జరుగుతోంది. బయటికి పొగ రాకుండా.. లోలోపల రాజకీయం సెగలు గాక్కుతోంది. హరీష్ రావు, కేసీఆర్ కుటుంబం మధ్య ఏమి జరుగుతుందో అసెంబ్లీ లో కరెక్టుగా కనిపించింది. హరీష్ ఒంటరిగానే మూడు రోజుల బడ్జెట్ సెషన్ ను గడిపారు.6 గతం లో అసెంబ్లీ అంటే టక్కున హరీష్ రావు గుర్తుకు వచ్చేది. సభలో హరీష్ రావు చకచకా పావులు కదపడం.. సభలో అందరి దగ్గరికి వెళ్ళి పలకరించడం.. ఎమ్మెల్యేలు కూడా హరీష్ రావు కూర్చున్న దగ్గరకు వెళ్లి ఆయనతో మాట్లాడటం ఇవన్నీ కనిపించేది. కానీ మూడు రోజుల పాటు జరిగిన తెలంగాణ అసెంబ్లీ లో ఈ సారి అవేమీ కనపడలేదు. ఎవరితోనూ హరీష్ రావు పెద్దగా కలవలేదు. ఎమ్మెల్యేలు కూడా హరీష్ రావును కలిసేందుకు ప్రయత్నం చేయలేదు. హరీష్ రావు కు కేసీఆర్ కు మధ్య మాటలు లేవన్న సంగతి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పడిగట్టారేమో ఆయనతో మాట్లాడితే కేసీఆర్ పగ పడతారని భవిచినట్లుంది. ఎమ్మెల్యేలు హరీష్ వైపు చూసేందుకు కూడా భయపడ్డారు.

Harish Rao with Ktr

అసెంబ్లీ లో ఒక్కొక్క టేబుల్ పై ఇద్దరు కూర్చుంటారు. కానీ హరీష్ రావు పక్కన కూర్చోవడానికి ఎవరు రాకపోవడంతో ఒక్కరే కూర్చున్నారు. కారు దిగారా అంతే ఎవరితోనూ మాట్లాడకుండా నేరుగా ఆయనకు కేటాయించిన సీటు వరకు తక ఎత్తలేదు హరీష్. మళ్ళీ అసెంబ్లీ ముగిసిందా నేరుగా కారు ఎక్కి ఇంటికి వెళ్లిపోయాడు. 

Harish Rao is single in trs

కెటిఆర్ ఒకటిరెండు సార్లు హరీష్ ను కల్సినా ముభావంగానే మాట్లాడారు. పద్మారావు డిప్యూటీ స్పీకర్ గా ఎన్నుకున్న ఎన్నుకున్న సందర్భంలో మాత్రమే పది నిమిషాల సేపు హరీష్ రావు మాట్లాడారు. గతంలో హరీష్ తో క్లోజ్ గ వున్న అధికారులు కూడా ఆయనను కలవకుండా జాగ్రత్త పడ్డారు. కేసీఆర్ అయితే కనీసం హరీష్ రావు పేరు ఎత్తలేదు. గతంలో హరీష్ పేరు తీయకుండా కేసీఆర్ ప్రసంగం కొనసాగేది కాదు. ఇప్పుడు భిన్నం. భవిష్యత్ హరీష్ రావు ఇంతే అని కేసీఆర్ ఈ అసెంబ్లీ సమావేశాల ద్వారా మిగతా ఎమ్మెల్యేలకు చెప్పేశరా అనే చర్చ ఎమ్మెల్యే ల్లో జరిగింది. హరీష్ ఒంటరిగా కనిపించటం.. ముభావంగా వుండటం తో ఆయన ఉన్నా లేనట్లే కనిపించింది.

tags: Harish Rao, Ktr, kcr family, kaleswaram project, Telangana irrigation projects, kcr son, cm kcr cell nber, cm kcr Telangana, pragathibavan, Telangana assembly, Telangana budget, cm kcr, Telangana MLAs , Telangana CMO.

Related Post