ఇందిర‌మ్మ.. సోనియ‌మ్మ‌ బాట‌లో రాహుల్ ..!

news02 March 15, 2019, 6:46 p.m. political

RAHUL

డిల్లీ : కాంగ్రెస్ చీఫ్  రాహుల్‌ గాంధీ ఈ సారి లోక్‌ సభ ఎన్నికల్లో దక్షిణాదిలోనూ పోటీ చేయనున్నారు. ఈ వార్తలు ఇప్పుడు ఆ పార్టీలో జోరుగా వినిపిస్తున్నాయి. ఆయన ఎప్పుడూ పోటీ చేసే ఉత్తర్‌ ప్రదేశ్ లోని అమేథీతో పాటు ఈ సారి ఆయన కర్ణాటక నుంచి కూడా బరిలోకి దిగనున్నారని సమాచారం. తన ఎన్నికల ప్రచారాన్ని కూడా దక్షిణాది నుంచే ప్రారంభించడం ఈ వార్తలకు మరింత బ‌లాన్నిస్తుంది. దక్షిణాది నుంచి పోటీ చేయాలంటూ కాంగ్రెస్‌ కార్యకర్తలు .. కొందరు సీనియర్‌ నేతలు రాహుల్‌ గాంధీని కోరారట. 

RAHUL

ద‌క్షిణాది నాయ‌కులు కార్య‌క‌ర్త‌ల  డిమాండ్లకు తలొగ్గిన రాహుల్ ద‌క్షిణాదిలో పోటీకి అంగీకరించారట. కన్నడ రాష్ట్రంలో ఓ కీలక స్థానం నుంచి ఆయన పోటీ చేయనున్నారని సమాచారం. గతంలో సోనియా గాంధీ సైతం కర్ణాటకలోని బళ్లారి నుంచి పోటీ చేసి సుష్మా స్వరాజ్ పై గెలుపొందారు.  2014 ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ కూడా వారణాసి .. వడోదర నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు. అయితే వీటిపై రాహుల్‌ గానీ .. అటు కాంగ్రెస్‌ వర్గాలు గానీ అధికారికంగా స్పందించాల్సి ఉంది.  అప్పుడే .. ఈ వార్తలు నిజమో కాదో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

RAHUL

tags: RAHUL GANDHI IS ALSO CONTESTING IN SOUTH INDIA,RAHUL GANDHI,SONIYA GANDHI,PRIYANKA GANDHI,NERENDRA MODI,AMITH SHA,KARNATAKA,LOKSABHA ELECTIONS,TELANGANA,ANDRAPRADESH,TAMILNADU,KERALA,UTTARPRADESH,TPCC,AICC

Related Post