కేసీఆర్ మోదీ ఏజెంట్ ..!

news02 March 19, 2019, 3:33 p.m. political

shabbir ali

హైద‌రాబాద్ : సీఎం కేసీఆర్ కు కాంగ్రెస్ శాస‌న మండ‌లి నేత ష‌బ్బీర్ అలీ స‌వాల్ విసిరారు. కేసీఆర్ కు ధైర్యం ఉంటే ఖ‌మ్మం ఎంపీగా పోటీ చెయ్యాల‌న్నారు. ఖమ్మం జిల్లా ప్రజల అజాభిప్రాయాన్ని కాదని .. కేసీఆర్ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను కొన్నాడ‌ని ఆయ‌న ద్వ‌జ‌మెత్తారు. అందుకే కేసీఆర్ కు దమ్ముంటే ఖమ్మం ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తే .. ఆ జిల్లా ప్రజాభిప్రాయమేంటో తెలుస్తుందన్నారు. ఒక్కో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేకు 25కోట్లు .. కార్పొరేషన్‌ పదవులు .. వీలైతే మంత్రి పదవి ఆశ చూపి టీఆర్ఎస్ లో చేర్చుకుంటున్నారని విమ‌ర్శ‌లు గుప్పించారు. 

shabbir ali

గాంధీభవన్ లో విలేకరులతో మాట్లాడిన ష‌బ్బీర్ అలీ .. అసెంబ్లీ ఎన్నికల్లో గెలవగానే ఫెడరల్‌ ఫ్రంట్‌ అన్న కేసీఆర్ ... పార్లమెంట్‌ ఎన్నికలొచ్చేసరికి జాతీయ పార్టీ స్థాపిస్తా అంటున్నాడని ఎద్దేవా చేశారు. ఇక్కడ మోదీని తిట్టే కేసీఆర్ .. ఢిల్లీ వెళ్లి ఆయ‌న కాళ్లు పట్టుకుంటారని ఫైర్ అయ్యారు. కేసీఆర్ మోదీ ఎజెంట్ అంటూ నిప్పులు చెరిగారు ష‌బ్బీర్.

shabbir ali

tags: SHABBIR ALI,MLC,CONGRESS MLCS,KCR,MP SEATS,UTTAM KUMAR REDDY,REVANTH REDDY,JANAREDDY,RAHUL GANDHI,SONIYA GANDHI,PRIYANKA GANDHI,AICC,GANDHI BHAVAN,TRS,KTR,KALVAKUNTLA KAVITHA,HAISH RAO,SHABBIR ALI,KCR,KHAMMAM,TRS MPS,TDP MPS,CONGRESS MPS,LOK SABHA

Related Post