ఎంపిగా పోటీ చేయాలి.. లోన్ ఇవ్వండి..!

news02 March 12, 2019, 9:29 p.m. political

/bank_lone_for_election_expendeechar

హైద‌రాబాద్ : ఎన్నిక‌ల్లో పోటీ చేయాలి.. నాకు లోన్ ఇవ్వండి.. అంటు ఓ సామాజిక కార్య‌క‌ర్త బ్యాంక్ కు పెట్టుకున్న రిక్వేస్ట్ .. ఇప్ప‌డు సోష‌ల్ మీడ‌యాలో వైల‌ర్ అవుతుంది. అవును... వెంక‌ట ర‌మ‌ణ అనే సామాజిక కార్య‌క‌ర్త .. సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నుండి పోటి చేయాల‌ని డిసైడ్ అయ్యార‌ట‌. అయితే .. త‌నకు ఆర్థిక స్తోమ‌త లేక‌పోవ‌డంతో.. ఎన్నిక‌ల‌కు కావ‌ల్సిన ఖర్చు కోసం ఆయ‌న  బ్యాంకు బాట ప‌ట్టారు. త‌న‌కు ప్రజాసేవ చేయాలనే ఆశ ఉన్నా.. ఎన్నికల్లో పోటీ చేసేందుకు కావాల్సినంత డబ్బు లేదని, ఎన్నికల్లో పోటీ చేయడానికి డబ్బు లోన్ ద్వారా ఇవ్వాలంటూ నల్లకుంటలోని కెనరా బ్యాంకులో దరఖాస్తు చేశారు.

bank_lone_wants_fight_for_elections

ప్ర‌తి రంగానికి బ్యాంక్ లు, రుణాలు ఇస్తున్ఆన‌యి. అదే విదంగా..  సామాన్యులు, సామాజిక కార్యకర్తలు ఎన్నికల్లో పోటీ చేయాల‌నుకుంటే.. వారికి లోన్ ఇస్తే త‌ప్పేంట‌ని ఆయ‌న ప్ర‌శ్నిస్తున్నారు. అందుకే త‌న‌కు ద‌య‌చేసి ఎన్నిక‌ల ఖ‌ర్చు కు అయ్యే డ‌బ్బుల‌ను రుణంగా  ఇవ్వాలంటూ  అభ్యర్ధిస్తున్నారు వెంక‌ట‌ర‌మ‌ణ‌. . వెంక‌ట‌ర‌మ‌ణ‌..2014లో అంబర్‌పేట నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అప్పుడు ఎన్నిక‌ల ఖ‌ర్చు కోసం.. భిక్షాటన కూడా చేశారు. వందలకోట్ల రూపాయలు అప్పు తీసుకోని బ్యాంక్లకు ఎంతోమంది బడాబాబులు మోసగిస్తున్నారని, మరి మాలాంటి సామజిక కార్యకర్తలు ఎన్నికల్లో పోటిచేయడానికి లోన్ ఇవ్వమని అడిగితే ఎందుకు కదరదు అంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు. బ్యాంక్ ల‌ను మోసం చేస్తున్న బ‌డాబాబుల‌కు ఓన్యాయం.. మాకో న్యాయమా..అంటున్నారు. అంతేకాదు.. సామజిక కార్యకర్తలు సామజిక ఉద్యమ కారులకు ఎన్నిలలో పోటిచేయడానికి బ్యాంక్ లోన్ ఇవ్వాలని పార్లమెంట్ లో బిల్లు పెట్టాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

tags: venkataramana wants bank lone, fight for elections, secendrabad parlament, lock sabha, election commission, telanaga, ec, ts

Related Post