ఎమ్మెల్యే అనుకున్న‌ది ఒక‌టి ..అయ్యిందొక్క‌టి..

news02 June 11, 2019, 10:04 a.m. political

TRIPURA_MLA_DHANAN_JOY, RAPE CASE, POLICE,

త్రిపుర : తాను ఎమ్మెల్యేను.. తానేమి చేసినా.. అడ్డుకునేదెవ‌రు.. అన్న ధీమాలో ఏకంగా ఓ మ‌హిళ‌పైనే ఆత్యాచారం చేశాడు ఆ ఎమ్మెల్యే. పెళ్లి చేసుకోమంటే.. నీ దిక్కున్న‌చోట చెప్పుకో అంటూ.. హెచ్చ‌రించారు. సీన్ క‌ట్ చేస్తే.. త‌న త‌ప్పుకు లెంప‌లేసుకుని.. అదే మ‌హిళ‌ను పెళ్లీ చేసుకున్నారు. వివ‌రాల్లోకి వెళితే.. ఆ ఎమ్మెల్యే పేరు ధనన్ జోయ్. త్రిపురలోని రిమా వ్యాలీ ఐపీఎఫ్‌టీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే. త్రిపురలోని దలాయికి చెందిన ఓ గిరిజన మహిళ మే 20న అగర్తలలోని మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఎమ్మెల్యే ధనన్ జోయ్ పై ఫిర్యాదు చేసింది. తనపై ఎమ్మెల్యే అత్యాచారానికి పాల్పడ్డాడని, తనను వివాహం చేసుకునేందుకు నిరాకరిస్తున్నారని ఫిర్యాదులో చెప్పింది. కొంతకాలంగా తనతో సన్నిహితంగా ఉన్నారని, చివరికి పెళ్లి అనేసరికి దూరంగా ఉంటున్నారని ఆ మహిళ తన ఫిర్యాదులో తెలిపింది. దీంతో పోలీసులు ఎమ్మెల్యేపై కేసు బుక్ చేశారు. ఐపీసీ 417, 376 సెక్షన్ల కింద పోలీసులు ఎమ్మెల్యేపై కేసులు నమోదు చేసి..అరెస్ట్ కి రంగం సిద్ధం చేశారు. 

REPE_CASE_ON_TRIPURA_MLA_DHANAN

మ‌రోవైపు ఈ కేసులో ప్రజా సంఘాలు గిరిజన మహిళకు అండగా నిలిచాయి.  ఈ కేసులో ఎమ్మెల్యేను ఆరెస్ట్ చేయాల‌ని.. ఆత‌ని నిర్బ‌య కేసు పెట్టి శిక్షించాల‌ని డిమాండ్ చేస్తూ.. రోడ్డెక్కాయి. దీంతో ఎమ్మెల్యేను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్దం కావ‌డంతో.. ముంద‌స్తు బేయిల్ కోసం ఆ ఎమ్మెల్యే ప్ర‌య‌త్నించారు.కాని బెయిల్ రాక‌పోవ‌డంతో.. చేసేది లేక‌.. త‌న త‌ప్పును స‌రిదిద్దుకుంటున్నానంటూ.. ఆ మ‌హిళ‌తో రాజీకొచ్చారు. మ‌రో దారి లేక‌.. చివరికి ఆ మ‌హిళ‌ను పెళ్లి ఆదివారం పెళ్లీ చేసుకుని వివాదానికి తెర‌దించి.. ఊపిరి పీల్చుకున్నారు ఆ ఎమ్మెల్యే.

tags: tripura mla dhanan joy, plice, st girl complent on mla, womens protest,marreige,

Related Post