కేసీఆర్ పై పీసీసీ చీఫ్ ఉత్తమ్ ఫైర్

news02 March 3, 2019, 5:38 p.m. political

uttam

కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను ఎంతకు కొనుగోలు చేశారో కేసీఆర్‌ చెప్పాలని పీసిసి చీఫ్ ఉత్తమ్‌ కుమార్ రెడ్డి డిమాండ్‌ చేశారు. సీఎల్పీ సమావేశం ముగిసిన తరువాత కాంగ్రెస్ నేతలంతా అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహం ముందు ఆందోళన చేశారు. సీఎం కేసీఆర్‌ వైఖరిని నిరసిస్తూ ఎమ్మెల్యేలు నల్ల బ్యాడ్జీలు ధరించి ఆందోళనకు దిగారు. అంతకు ముందు సీఎల్పీ సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు టీఆర్ ఎస్ పార్టీలో చేరుతున్నట్లు భహిరంగంగా ప్రకటంచడంపై నేతలు చర్చించారు. అసెంబ్లీలో టీఆర్ ఎస్ కు సంఖ్యాబలం ఉన్నప్పటికీ..  ప్రతిపక్షంలో కాంగ్రెస్‌ పార్టీ లేకుండా చేయాలనే దురుద్దేశంతో సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని నేతలు ఆరోపించారు.  డిప్యూటీ స్పీకర్‌ ఎన్నిక విషయంలో కాంగ్రెస్‌ హుందాగా వ్యవహరించిని విషయాన్ని ఈ సందర్బంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గుర్తు చేశారు. 

uttam
డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం కావడానికి తామంతా సహకరించామని ఆయన తెలిపారు. కానీ ఇప్పుడు అక్రమ మార్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టి.. టీఆర్ ఎస్ పార్టీలో చేర్చుకుంటున్నారని సీఎం కేసీఆర్ పై ఉత్తమ్ మండిపడ్డారు. ఎన్నికల్లో అక్రమాలతోనే టీఆర్ ఎస్ అధికారంలోకి వచ్చిందని పీసిసి చీఫ్ ఆరోపించారు.  సీఎం కేసీఆర్‌ రాజనీతి ప్రకారం నడుచుకుంటారని భావించామని.. కానీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు.  ఇక కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను  కొనుగోలు చేయడం వికృత చర్య అని సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క విమర్శించారు. కేసీఆర్ చేస్తోన్న ఎమ్మెల్యేల కొనుగోళ్ల అంశంపై విస్తృతంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. 

tags: uttam, pcc chief uttam, uttam fire on kcr, uttam fire on cm kcr, clp meeting, clp fire on kcr, clp meeting fire on cm kcr, congress leadrs fire on cm kcr, congress leaders protest at assembly, congress leaders protest at assembly gandhi statue

Related Post