కేసీఆర్ జ‌గ‌న్ ల దోస్తీకి నిద‌ర్శ‌న‌మంటూ లోకేశ్ సెటైర్లు ..!

news02 March 13, 2019, 8:45 p.m. political

lokesh

అమ‌రావ‌తి : టీఆర్ఎస్ వైసీపీ దోస్తానాపై మంత్రి లోకేశ్ మ‌రో సారి ట్విట్ట‌ర్ వేదిక‌గా సెటైర్లు విసిరారు. టీఆర్ఎస్ ఎన్నిక‌ల ప్ర‌చార ర‌థాల‌ను వైసీపీ వాడుకోవ‌డంపై ఆయ‌న విమ‌ర్శ‌లు గుప్పించారు. తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ వినియోగించిన ప్రచార రథాలు ఇప్పుడు ఏపీలో దర్శనమివ్వ‌డంతో ఆయ‌న విమ‌ర్శ‌ల డోస్ పెంచారు. ఆ వాహనాలను వైసీపీ ప్రచార రథాలుగా మార్చుకొని వాడుకుంటున్నారు. దీంతో వైసీపీ అడ్డంగా దొరికి పోయిందంటూ టీడీపీ ఫైర్ అవుతోంది.

lokesh

ఇక వివ‌రాల్లోకి వెళితే ..  నెల్లూరు జిల్లా వేదాయపాలెం పుట్టవీధిలోని ఓ మెకానిక్ షెడ్డులో టీఆర్‌ఎస్ వాహనాలకు వైసీపీ కలర్ వేస్తున్నారు. టీఆర్‌ఎస్ ప్రచార రథాలు వైసీపీ ప్రచార రథాలు మారుతున్న విషయంపై మంత్రి లోకేష్ త‌న ట్విట్ట‌ర్ లో ఘాటుగా స్పందించారు. ప్రతిపక్ష నేత జగన్ .. సీఎం కేసీఆర్ దోస్తీకి ఇదే నిదర్శనమని కౌంటరిచ్చారు. వైసీపీ ప్రచార వాహనం లోపల సీట్లకు కారు గుర్తు ముద్రించి ఉన్న ఫొటోలు ఆయ‌న త‌న ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేసి కామెంట్ చేశారు.

lokesh

tags: NARA LOKESH,YS JAGAN MOHAN REDDY,TDP,YCP,CHANDRA BABU,PAWAN KALYAN,JANA SENA,ANDRA PRADESH,LOKESH,JAGAN,KCR,KTR,KAVITH,HARISH RAO

Related Post