కేసీఆర్ కు ఊహించ‌ని షాక్ ..!

news02 March 19, 2019, 3:05 p.m. political

uttam kumar reddy

హైద‌రాబాద్ : క‌ష్ట‌కాలంలో ఉన్న పార్టీని విజ‌య‌తీరాల వైపు తీసుకెళ్ళేందుకు మ‌రో సారి బాద్య‌త‌ను బుజానికెత్తుకున్నారు పీసీసీ చీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓట‌మితో డీలాప‌డి ఉన్న క్యాడ‌ర్ లో మ‌నోధైర్యం నింపేందుకు తానే స్వ‌యంగా ఎంపీ బ‌రిలో దిగి .. ఎన్నిక‌ల స‌మ‌ర‌ఖంశారావాన్ని పూరించారు ఉత్త‌మ్. ఆయ‌నే స్వ‌యంగా న‌ల్గొండ ఎంపీ బ‌రిలో దిగ‌డం అధికార టీఆర్ఎస్ పార్టీకి ఊహించ‌ని షాక్ అనే చెప్పాలి. తాను పోటీ చేయ్య‌డ‌మే కాదు .. అధిష్టానంతో మాట్లాడి రేవంత్ రెడ్డి .. కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి .. వంశీచంద్ రెడ్డి లాంటి వారిని కూడా ఎంపీ ఎన్నిక‌ల్లో పోటీకి ఒప్పించ‌గ‌లిగారు ఉత్త‌మ్. సీనియ‌ర్లు లోక్ స‌భ బ‌రిలో దిగ‌డంతో తెలంగాణ‌లో గులాబీ పార్టీకి రుచించ‌ని ప‌రిణామ‌మ‌ని రాజ‌కీయ విశ్లేణ‌కులు అంటున్నారు.

uttam kumar reddy

ఉత్త‌మ్ పార్ల‌మెంట్ ఎన్నిక‌ల వ్యూహంతో .. ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వ‌చ్చానా .. కేసీఆర్ త‌న ఎంపీ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించ‌లేని స్థితిని క్రియేట్ అయ్యింది. చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో అభ్య‌ర్థుల‌ను మార్చే ప‌రిస్థితి టీఆర్ఎస్ మొద‌లైయ్యింది. ఇక న‌ల‌గొండ లోక్ స‌భ బ‌రిలో ఉత్త‌మ్ కుమార్ రెడ్డి పోటీకి దిగ‌డంతో అధికార పార్టీ త‌న అభ్య‌ర్థి ఎంపిక‌లో తిక‌మ‌క ప‌డాల్సి వ‌చ్చింది. ఉత్త‌మ్ ఎన్నిక‌ల బ‌రిలో దిగ‌డంతో ఉమ్మ‌డి న‌ల్గొండ జిల్లాలో వార్ వ‌న్ సైడ్ అయ్యింద‌నే విశ్లేష‌ణ‌లు పొలిటిక‌ల్ సర్కిల్లో వినిపిస్తున్నాయి. పార్టీ క‌ష‌క‌ట‌కాలంలో ఉన్న స‌మ‌యంలో కాడి దించ‌డం స‌రికాద‌నే ఉత్త‌మ్  మ‌ళ్ళి ఎన్నిక‌ల పోటీలో దిగుతున్నాడ‌ని పార్టీ నాయ‌కులు చెబుతున్నారు. 

uttam kumar reddy

ఉత్త‌మ్ పోటీతో న‌ల్గొండ జిల్లాలోనే కాదు .. మొత్తం 17 పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌భావం చూపుతుంద‌ని పార్టీ వ‌ర్గాలంటున్నాయి. ఇక ఉత్త‌మ్ ఎంపీ బ‌రిలో దిగ‌డం .. పార్టీ క్యాడ‌ర్ లో కూడా జోష్ నింపుతోంది. ఇప్ప‌టికే రాష్ట్ర వ్యాప్తంగా క్యాడ‌ర్ ఆనందోత్సాహ‌ల్లో మునిగిపోయారు.

uttam kumar reddy

tags: UTTAM KUMAR REDDY,LOK SABHA,CONGRESS MPS,RAHUL GANDHI,REVANTHREDDY,KOMATIREDDY VENKTREDDY,VAMSHI CHAND REDDY,DK ARUNA,GANDHI BHAVAN,RC KUNTIYA,PRIYANKA GANDHI,TELANGANA,SONIYA GANDHI,BJP,NERENDRA MODI,KCR,KTR,HARISH RAO,KAVITHA,TRS MPS,TRS BHAVAN,NALGONDA MP

Related Post