శాతకర్ణి సినిమాలో అనసూయ..

సినిమా పిల్లర్- నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వందో సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి. క్రిష్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా తెలుగుజాతి ఔనత్యాన్ని, గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన చక్రవర్తి గౌతమీపుత్ర శాతకర్ణి జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పటికే ఈ సినిమా థియేటర్లలో సందడి చేస్తోంది. ఇక ఈ సినిమాలో యాంకర్ అనసూయ కూడా ఉంది తెలుసా. బాలకృష్ణ సినిమాలో అనసూయ నటిగా కాదు.. వాయిస్ ఆర్టిస్ట్ గా.. ఈ సినిమాకి డబ్బింగ్ చెప్పింది అనసూయ. ఈ సినిమాలో ఇంకో గ్రీక్ యోధురాలిగా డచ్ మోడల్ ఫరాకరిమి నటించింది. ఈ పాత్ర నిడివి చాలా తక్కువే అయినా కీలక పాత్ర. ఈ పాత్రకి అనసూయ చేత డబ్బింగ్ చెప్పించారు. ఈ పాత్రకి తన డబ్బింగ్ బాగా కుదిరిందని, సినిమాలో తానూ కూడా భాగమైనందుకు ఆనందంగా ఉన్నదని చెప్పింది హాట్ భామ అనసూయ.

Related News

Newspillar Exclusives

Movies News More

Political News More

© 2016 NewsPiller. All rights reserved.